40.2 C
Hyderabad
May 6, 2024 18: 46 PM
Slider నెల్లూరు

తల్లి కూతురు ను ఆదుకున్న దిశా యాప్

#Disha app

అర్ధరాత్రి నడి రోడ్డుపై కారు పంక్చర్ అయింది. కారులో ఉన్నది కేవలం ఓ తల్లి, ఆమె కూతురు. చుట్టూ చిమ్మ చీకటి. కారు దిగి పంక్చర్ వేద్దామనుకున్నా… కారు డోరు తెరిచి, తెగించి దిగితే ఏమవుతుందో అనే భయం. ఏదైనా అఘాయిత్యం జరిగితే, అరిచి గీ పెట్టినా వినిపించుకునే నాధుడుండడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలి? దిశా యాప్ కి ఎస్.ఓ.ఎస్. కాల్ చేశారు. నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

ఒక ఆడపిల్ల దిశ యాప్ కాల్ కు స్పందించిన నెల్లూరు జిల్లా పోలీసులకు అంతా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి నెల్లూరు వైపుగా తన పిల్లలతో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ అర్థరాత్రి తమ కారు పంక్చర్ కావడంతో, భయాందోళన చెందింది. వెంటనే తేరుకుని దిశా యాప్ SOS కాల్ చేసింది. కేవలం 10 నిముషాలలో పోలీసులు వారి వద్దకు చేరుకొని సమస్యను పరిష్కరించారు చిన మర్రిపాడు పోలీసులు. ఆమె కారు టైర్ మార్పించి, సురక్షితంగా గమ్యం చేరేలా సహకరించారు. ఎపి పోలీసుల సేవలు సలాం అంటూ ఆ తల్లి, కూతుళ్ళు వాపోయారు

Related posts

ఘనంగా ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు

Satyam NEWS

Pollution: ఢిల్లీలో స్కూళ్లు బంద్

Bhavani

వార్నింగ్: వైసీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలి

Satyam NEWS

Leave a Comment