స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ ధర్మాసనం ఇచ్చిన తీర్పు హర్షణీయమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లి లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రివర్గ సభ్యులు రాజ్యాంగ వ్యవస్థ మీద నోరు పారేసుకోవద్దని తులసిరెడ్డి సూచించారు. వైసీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కు వైసిపి నాయకులు కుల ముద్ర వేయడం దారుణం అన్నారు. బుధవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్నికలపై తీర్పిచ్చిన నేపథ్యంలో ఆయన పై ఏ కులముద్ర వేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోందన్నారు.
ముఖ్యమంత్రి పదవికి కూడా పరిమితి అధికారాలు ఉంటాయి గానీ, అపరిమిత అధికారాలు ఉండవన్నారు. కుక్క చేయవలసిన పని కుక్క చేయాలి, గాడిద చేయవలసిన పని గాడిద చేయాలి అని ఆయన అన్నారు. ఎవరెవరు చేయవలసిన పనులు వారు చేయాలి అన్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గమనించాలన్నారు.