28.7 C
Hyderabad
May 5, 2024 08: 49 AM
Slider ముఖ్యంశాలు

రగులుతున్న రాజకీయం: రాజంపేట వైసీపీలో అసమ్మతి కుంపటి

#rajampet

అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో మంగళ వారం మునిసిపల్ కౌన్సిలర్ రేనాటి రాఘవరాజు,సిని దర్శకుడు శివమణి ఆధ్వర్యంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మేనత్త కుమారుడు  గాలివీటి విజయ సాగర్ రెడ్డి (మదన్ రెడ్డి )జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మునిసిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసుల రెడ్డి పాల్గొనగా, ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి అనుచరులు ఈ కార్యక్రమంకు దూరంగా ఉన్నారు.

ఈ సందర్భంగా పాత బస్ స్టాండ్ లో అభిమానులచే రక్తదాన శిబిరం నిర్వహించి, కేక్ కట్ చేసి,అన్నదానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా  గాలివీటి విజయసాగర్ రెడ్డి అంటూ వైసీపీ లో ఓ వర్గం ప్రచారం సాగించడంతో పాటూ ,పట్టణంలో ఉన్నా ఎమ్మెల్యే మేడా మళ్ళీ ఖార్జున రెడ్డి ఈ కార్యక్రమంలో హాజరు కాలేదు.

ఇటీవల మేడా స్వంత మండలంలోని ని మేజర్ గ్రామ పంచాయతీ నాగిరెడ్డి పల్లె లోని గొబ్బిళ్ళ సుబ్బరామయ్య స్కూల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గాలివీటి విజయ సాగర్ రెడ్డి కి మద్దతుగా ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి కి వ్యతిరేకంగా,జడ్పీ చైర్మన్ అకేపాటి అమరనాధ రెడ్డి వైసీపీ నేతలు మద్దతు కూడగట్టడం ఆసక్తికరంగా మారింది.

ఇదే సమయంలో పట్టణంలోని ఎమ్మెల్యే మేడా వ్యతిరేక వర్గీయులు మునిసిపల్ ఎన్నికల్లో రెబల్  వైసీపీ కౌన్సిలర్ గా నిలబడి గెలిచిన రేనాటి రాఘవ రాజు ఆధ్వర్యంలో గాలివీటి విజయసాగర్ రెడ్డి జన్మదిన వేడుకలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనితో వచ్చే ఎన్నికల్లో వైసీపీ రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రస్తుత ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి,జడ్పీ చైర్మన్ అకేపాటి అమర నాధ రెడ్డి లతో పాటూ గాలివీటి విజయసాగర్ రెడ్డి పేరు కూడా వినబడుతోంది.

Related posts

విత్తన వివాహ ఆహ్వాన పత్రిక!

Sub Editor

సమగ్ర శిక్ష లో పేరుకు పార్ట్ టైం, పనిచేస్తుంది ఫుల్ టైం

Satyam NEWS

కాపురాల ఏర్పాటుపై దేశంలో ఎలాంటి నిషేధం లేదు

Satyam NEWS

Leave a Comment