హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని నాగోల్ డివిజన్ ,బండ్లగూడ కి చెందిన అశ్వినికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీ చేశారు. నేడు హైదరాబాద్ లోని నాగోల్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొని కుట్టు మిషన్ అందచేశారు.
ఆయన సతీమణి, ఐవిఎఫ్ -ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రధమ మహిళ ఉప్పల స్వప్న చేతుల మీదుగా ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉచిత కుట్టు మిషన్ తో జీవనోపాధి, కుటుంబానికి ఆసరా లభిస్తుందని తెలిపారు.
దీని కారణంగా వారి జీవితాల్లో మరింత మేలు జరగాలి అని భావిస్తూ మీ కుటుంబానికి ఆదాయం, ఉపాధి లభించాలని చేదోడు వాదోడుగా ఉపయోగ పడుతుంది అన్నారు మీ కాళ్ల మీద మీరు జీవనం సాగించే జీవనోపాధి లభిస్తుంది అని తెలిపారు.