27.7 C
Hyderabad
May 4, 2024 07: 51 AM
Slider

ఆ సమయం లో అసలు బయటకు రావొద్దు

#public health

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయని, సగటున 42 డిగ్రీలు నమోదవుతుండటంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్యశాఖ ప్రజా రోగ్య సంచాలకులు డా జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో హీట్ వేవ్​అలర్ట్ ఉన్నట్లు మీడియాకు తెలిపారు. మరో వారం రోజుల పాటు

మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యలో బయటకు రావొద్దని సూచించారు. అత్యవసరమైతేనే తగిన జాగ్రత్తలతో వెళ్లాలన్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఎండ సమయంలో ఇళ్లకే పరిమితం కావాలన్నారు.ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ సాప్ట్​డ్రింక్స్, హై ప్రోటీన్​పుడ్​వంటివి తీసుకోవద్దన్నారు.

స్కిన్ మీద రెడ్​రసేష్, డ్రై స్కిన్, హెడ్​ఏక్, మజిల్ నొప్పులు వంటివి ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలన్నారు. కనీసం ప్రతీ రోజు మూడు లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. సీజనల్​ప్రూట్స్‌ను ఎక్కువగా తినాలన్నారు. ఎండ తాకిడి తగలకుండా గొడుగు, క్యాప్, పుల్ హ్యాండ్ దుస్తులు వంటివి ధరించాలన్నారు. వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు న్యూస్‌‌లో తెలుసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Related posts

తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవా టిక్కెట్ల ధరలు పెంచద్దు

Bhavani

మంత్రి కేటీఆర్ ను కలిసిన మంత్రి పువ్వాడ అజయ్

Bhavani

22న సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరిన విహెచ్ పి

Satyam NEWS

Leave a Comment