39.2 C
Hyderabad
May 3, 2024 14: 38 PM
Slider చిత్తూరు

తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవా టిక్కెట్ల ధరలు పెంచద్దు

#PadmavatiAmmavari

తిరుచానూరు అమ్మవారి ఆలయ దర్శనాల టిక్కెట్ల ధరల పెంపు కమిటీ తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి, చంద్రగిరి శాసనసభ్యులతో పాటు తిరుపతి జేఈవో, డిప్యూటీ ఈవో, టిటిడి అదనపు గణాంకాధికారి పెంచిన సేవా టికెట్ల ధరల ప్రొసీడింగ్స్ ను ఉపసంహరించుకోవాలని స్థానిక ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో “టిక్కెట్ల ధరల పెంపు ఏ ప్రాతిపదికన, ఎటువంటి ప్రామాణికంతో పెంచుతున్నారో ” భక్తులకు సమాధానం చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం టికెట్ల ధరల పెంపు పై భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలే తప్ప ఆర్టీసీ బస్సు చార్జీలు కరెంటు చార్జీలు పెంచినట్లు కమిటీలు వేసుకొని ఉన్నపలంగా పెంచడం సమంజసం కాదు అని ఆయన అన్నారు.

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని తిరుపతి,చంద్రగిరి పరిసర ప్రాంతాలలోని ప్రజలంతా స్థానిక ఆలయంగా భావించి తమ ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు అలాగే ప్రతి శుక్రవారం,ఇతర పర్వదినాలలో కుటుంబ సమేతంగా ముఖ్యంగా మహిళలు ఆలయానికి వెళ్లి నోములు నోచుకోవడం,మ్రొక్కులు తీర్చుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం!

శ్రీవారి,అమ్మవారి ఆలయంలో లడ్డూ వడల ధరలు పెంచడంలో భక్తులు ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు ముడి సరుకుల ధరలు పెరగడం కారణంగా తయారీ ఖర్చు పెరుగుతుంది కాబట్టి టిటిడి పై ఆర్థిక భారం పడుతుంది కాబట్టి భక్తులంతా స్వాగతిస్తున్నాం!

తిరుచానూరు ఆలయ దర్శన టికెట్ల ధరలను పెంచి భక్తులకు అదనంగా మీరిచ్చే వెసులుబాటు ఏమిటి గతంలో 100 రూ”విఐపి టికెట్ కొని క్యూ లైన్ లో వెళ్లే భక్తుడు ఇప్పుడు అదే క్యూలైన్లో “సుపదం” అని పేరు పెట్టి పెంచిన 200 రూపాయల టికెట్ కొని వెళ్లి దర్శించుకుంటే భక్తులపై భారం పడుతుంది టీటీడీ కీ అదనంగా ఆదాయం వస్తుందే తప్ప వచ్చే భారం ఏమీ లేదుగా!

కుంకుమార్చన సేవ గతంలో 200 రూ” లకు ఇద్దరు భక్తులను అనుమతించేవారు అలాంటిది ఒక్కరికి 250 రూపాయలు చేశారు అంటే ఇద్దరు వెళ్లాలంటే 500 రూ” అవుతుంది ఒక్కసారిగా అంత పెంచడం భావ్యమేనా!

తిరుమల తిరుపతి దేవస్థానం అతి పెద్ద హిందూ ధార్మిక సంస్థ శ్రీవారి భక్తులు స్వామి వారికి భక్తితో అనేకమార్గాలలో కానుకలు సమర్పిస్తున్నారు హుండీ ద్వారా, అన్నదానం ట్రస్టు,ప్రాణదాన ట్రస్టు, ఎస్వీబీసీ ట్రస్టు,శ్రీవాణి ట్రస్టు ఇలా అనేక ట్రస్టులు ఉన్నాయి వాటితో పాటు తలనీలాల వేలం ద్వారా,లడ్డు ప్రసాదాల విక్రయం ద్వారా అద్దె గదుల ద్వారా ఆదాయం వస్తుంది అలాంటి పవిత్రమైన ధార్మిక సంస్థను వ్యాపార సంస్థగా మార్చడం బాధాకరం!

తిరుమలలో శ్రీవారి సేవ టికెట్లను అద్దె గదులను లడ్డు ప్రసాదాల ధరలను ఇటీవల పెంచారు అదే తరహాలో తిరుచానూరు అమ్మవారి ఆలయ దర్శనం టికెట్లను పెంచడం భక్తులపై భారం మోపడమే….

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సామాన్య మధ్యతరగతి కుటుంబం తిరుచానూరు అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ ఇలా టిక్కెట్ల ధరలు పెంచుతూ పోతే సామాన్యులకు శ్రీవారి అమ్మవారి దర్శనం అందని ద్రాక్షలా మారుతుంది!

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సంబంధించిన దర్శనాల ధరల పెంపు నిర్ణయాలు తీసుకునే ముందు స్థానికుల నుంచి సామాన్య భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకొని ప్రకటిస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు భక్తులు హర్షిస్తారు అని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.

Related posts

గుర్రంపై వచ్చి నామినేషన్

Satyam NEWS

శ్రీవారి గరుడసేవలో రాష్ట్ర డిజిపి కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి

Satyam NEWS

చకోర రవం

Satyam NEWS

Leave a Comment