28.7 C
Hyderabad
May 6, 2024 10: 13 AM
Slider మహబూబ్ నగర్

రాజ్యాంగంలో అంబేద్కర్ ఆనాడే పొందుపరిచారు

supreme court

ఈనాటి పరిస్థితిని అంబేద్కర్ ముందే గ్రహించారు. ఏదో ఒక రోజు అనుకోకుండా ఒక పెద్ద వ్యాధి వ్యాపించవచ్చు. ఆ సమయంలో పేద, సామాన్య ప్రజలు ఆసుపత్రిలో ఎలా?  వైద్యం అందించుకోగలగుతారో లేదో నని ఆయన ఆనాడే అనుమానించారు.

సామాన్యుడికి ఇబ్బందులు వాటిల్ల కూడదని, ఏ వ్యాధి వ్యాపించినా ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాలని అంబేద్కర్ రాజ్యాంగంలో  పొందుపరిచారు. అదే ఆర్టికల్ 21. ఇప్పుడు ఇదే అంశాన్ని సుప్రీం కోర్టు తన తీర్పులో ఉటంకించింది.

దేశ ప్రజలందరికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. శశాంక్‌ డియో సుధి అనే న్యాయవాది వేసిన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం ఈ సూచన చేసింది.

వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం రూ.4,500 వసూలు చేసేలా ప్రైవేటు ల్యాబ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా పరీక్షల కోసం పెద్ద మొత్తంలో వసూలు చేసేలా ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతినివ్వకూడదు. ప్రభుత్వమే దీనికి సంబంధించిన పరికరాలను సమకూర్చుకోవాలి అని ధర్మాసనం స్పష్టం చేసింది.

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుదలకు తగ్గట్టుగా సౌకర్యాలు లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్‌లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇది పేదలకు భారంగా మారనుందని, ఆర్టికల్ 21 కింద జీవించే హక్కుకు భంగం వాటిల్లుతుందని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఇంకా ఇప్పటికి అంబేద్కర్ ఆలోచనలు,ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించేవారు అర్థం చేసుకోండి. ఆయన రచించిన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు ఎందుకు కొనియాడాయో. అందుకే ఆయన ప్రపంచ మేధావి అయ్యారు.

అవుట రాజశేఖర్ కొల్లాపూర్

Related posts

ఎన్ పీ ఆర్ పై అవగాహన లేని నిర్ణయాలు

Satyam NEWS

50 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన హిందుస్థాన్ యూనీలీవ‌ర్‌

Satyam NEWS

విక్టరీ: టీఆర్ఎస్ ఆధీనంలో జనగామ మునిసిపాలిటీ

Satyam NEWS

Leave a Comment