26.7 C
Hyderabad
May 3, 2024 09: 15 AM
Slider ఆదిలాబాద్

క్వారంటైన్ లో ఉన్న 11 మంది ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి

nirmal police 081

నిర్మల్ జిల్లా లోని వివిధ క్వారంటైన్ కేంద్రాలలో ఉన్న ఢిల్లీ మార్కజ్ కు వెళ్లి వచ్చిన వారిలో గడువు పూర్తయినందున, నెగిటివ్ రిపోర్టులు వచ్చినందు 11 మందిని ఇళ్లకు పంపించామని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు.

 బుధవారం సాయంత్రం సోఫీనగర్ సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల,( కళాశాల) కొరంటైన్ లో ఉన్న ఢిల్లీ మార్కెజ్ కు వెళ్లివచ్చిన వారిలో11 మంది కి కరోనా వైరస్ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని, కోరం టైన్ గడువు కూడా పూర్తి అయినందున వారికి కరోనా వైరస్ సోకి లేదనే ధ్రువ పత్రం ఇచ్చి వారి వారి నుండి  వారు తమ తమ ఇళ్లలోనే హోమ్ కోరంటైన్ ఉంటామనే హామీ పత్రం తీసుకొని పంపించారు.

వారి చేతుల పై కోరంటైన్ స్టాంప్ వేసి బుధవారం సాయంత్రం వారిని వారి వారి ఇండ్లకు పంపించారు. కలెక్టర్ కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల సందర్శించి అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి మాట్లాడారు. గడువు పూర్తయిన, నెగెటివ్ రిపోర్టులు వచ్చిన వారందరినీ రెండు, మూడు రోజులలో ఇళ్లకు పంపుతామన్నారు.

అనంతరం చించోలి బి మహిళా ప్రాంగణం కేంద్రం సందర్శించి అక్కడ చేపట్టిన రక్త నమూనాల(శాంపుల్ ) సేకరణ కార్యక్రమమును పరిశీలించారు. జిల్లా ఎస్పీ శశిధర్ రాజు మాట్లాడుతూ కోరంటైన్ లో ఉన్న వారు సామాజిక దూరం పాటించాలని సూచించారు.

నెగెటివ్ రిపోర్టులు వచ్చిన వారందరినీ త్వరలో వారి వారి ఇండ్లకు పంపనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, జిల్లా కరొనా నియంత్రణ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ కార్తీక్, సీఐ జాన్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీవారి సేవలో సినీ నటి రమ్యకృష్ణ

Satyam NEWS

Autocrat : ఉక్రెయిన్ పై రష్యా ఉగ్ర (వాదం) రూపం

Satyam NEWS

న్యాయవ్యవస్థపై ఏపి సిఎం వైఎస్ జగన్ తిరుగుబాటు

Satyam NEWS

Leave a Comment