Slider విజయనగరం

మ‌హారాజా సంగీత నృత్య క‌ళాశాల‌కు ల‌క్ష విలువ చేసే ప‌రికరాలు అంద‌జేత‌

క‌ళాశాల‌కు వాయిద్య ప‌రిక‌రాలు ఇచ్చిన ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల కుటుంబ‌ స‌భ్యులు

విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చూపిన సేవా స్ఫూర్తితో ప్రజలకు అండగా ఉంటూ, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నామని విద్య‌ల న‌గ‌ర‌మైన‌విజ‌య‌ నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి ,ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి పెద్దల్లుడు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నాగ అభిషేక్ అన్నారు.ఈ మేర‌కు ప్రభుత్వ సంగీత కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు.

ముందుగా కళాశాలలో సరస్వతీ విగ్రహానికి, పూసపాటి విజయరామ గజపతిరాజు విగ్రహానికి కోలగట్ల పెద్ద కుమార్తె డాక్టర్ సంధ్య, అల్లుడు నాగ అభిషేక్, చిన్న కుమార్తె నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి లు పూలమాల వేశారు. ఈ సందర్భంగా సంగీత కళాశాల కు అవసరమైన లక్ష రూపాయలు విలువచేసే సంగీత వాయిద్య పరికరాలు వీణ, రెండు వయొలిన్ లు, మృదంగం, రెండు సన్నాయిలు, రెండు శృతులు కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్న కుమారి కి అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ నాగ అభిషేక్ మాట్లాడుతూ తనది విజయనగరం కాకపోయినా, మామగారు ఎమ్మెల్యే కోలగట్ల నిత్యం ప్రజలతో మమేకమవుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న తీరు తనకు నచ్చింది అన్నారు. నగరాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని, అలాగే సేవాగుణం తో ఎంతోమంది అన్నార్తులను , ఆయా స్వచ్ఛంద సంస్థలను అందుకుంటున్న తీరు తనకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

తన భార్య , డాక్టర్ కోలగట్ల సంధ్య కూడా తండ్రి చూపిన సేవా మార్గాన్ని అనుసరిస్తోందని అన్నారు. విజయనగరంలో పుట్టి, పెరిగి యూ ఎస్ లో జనరల్ ఫిజీషియన్ గా వైద్య సేవలు అందిస్తున్న ఆమె, పుట్టిన ఊరికి సేవచేసే భాగ్యంగా కళాశాలకు అవసరమైన సంగీత వాద్య పరికరాలను అందివ్వడం అభినందనీయమన్నారు. విజయనగరం కు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు.

అనంత‌రం నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ తమ తండ్రి , ఎమ్మెల్యే కోలగట్ల చూపిన సేవా బాటలోనే తాము పయనిస్తున్నా మని అన్నారు. నగర అభివృద్ధికి ఎమ్మెల్యే కోలగట్ల ఎంతో కృషి చేస్తున్నారని, నియోజకవర్గ ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్నకుమారి మాట్లాడుతూ సేవ భావం గల కోలగట్ల కుటుంబం , కళాశాలలో పరిస్థితిని వివరించ గానే ముందుకు వచ్చి లక్ష రూపాయలు విలువ చేసే సంగీత వాయిద్య పరికరాలు అందించడం వారి సేవ గుణానికి నిదర్శనమని అన్నారు.

ఈ సందర్భంగా కళాశాల నిర్వాహకులు వీరికి జ్ఞాపికలు అందజేసి, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి

Satyam NEWS

రేపు ముంబాయికి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌

Satyam NEWS

సకల జనానికి చుక్కలు చూపిస్తున్న సూరిబాబు

Satyam NEWS

Leave a Comment