27.7 C
Hyderabad
May 4, 2024 07: 10 AM
Slider కరీంనగర్

తెలంగాణ ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలనేదే కేసీఆర్ లక్ష్యం

#ministergangula

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్ రూరల్ మండలం     మొగదుంపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ పథకం కింద నిర్మించిన ఇండ్లకు సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలు అందరూ సంతోషంగా ఉండాలనేదే కెసిఆర్ లక్ష్యమని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం తో పేదల కల సాకారం అయిందన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలన్న ఆలోచన రాలేదన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ నాయకత్వంలో నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతు బంధు, రైతు బీమా, సాగుకు 24 గంటల ఉచిత కరెంటు, దళిత బందు లాంటి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో నైనా అమలు అవుతున్నాయా అన్నారు.

కాలేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారా మండుటెండలో సైతం మత్తడి జరుగుతోందన్నారు. నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లలకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా లక్ష 116 రూపాయలను ప్రభుత్వమే అందజేస్తుంది అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన గర్భిణీలకు కెసిఆర్ కిట్ అందజేయడం జరుగుతుందన్నారు. జ్యోతిబా పూలే గురుకులాల్లో మెరుగైన విద్యాబోధన జగడం జరుగుతుందన్నారు.

పేదలు, రైతులు, ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల సంక్షేమం కోసం వందల సంఖ్యలో పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. దశలవారీగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. మగ్దుంపూర్ గ్రామంలో 52 మందికి గాను 40 మందికి ఇండ్లను అందజేయడం జరిగిందని మిగిలిన 12 మందికి త్వరలోనే పట్టాలు అందజేయడం జరుగుతుందన్నారు. మంత్రి అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పిటిసి, ఎంపీటీసీ దేవనపల్లి పుష్ప అంజిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ఆనందరావు, శ్రీనివాస్ సంపత్, జక్కన్న నరసయ్య తహసీల్దార్ వెంకట్ రెడ్డి, బండ తిరుపతి టిఆర్ఎస్ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

వచ్చే నెల 17న కొత్త సెక్రటేరియేట్ ప్రారంభం

Bhavani

స్టెరాయిడ్స్ అమ్మ‌కం.. ఇద్ద‌రు అరెస్టు

Sub Editor

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అరెస్టు వారంట్

Satyam NEWS

Leave a Comment