38.2 C
Hyderabad
April 28, 2024 20: 52 PM
Slider హైదరాబాద్

స్టెరాయిడ్స్ అమ్మ‌కం.. ఇద్ద‌రు అరెస్టు

steroids1

జిమ్‌కి వెళుతున్నా.. శారీర సౌష్ట‌వం పెంచాల‌నుకుంటున్నారా? పెంచండి కానీ అక్క‌డ ఫిట్‌నెస్ సెంట‌ర్ నిరా‌హ‌కులు చెప్పే న్యూట్రిష‌న్ ఫుడ్‌పై మాత్రం ఓ క‌న్నేసి వాటిపై ఆరా తీసి ఏది మంచిదో ఖ‌చ్చితంగా తెలుసుకొని వాడండి. అంతేగాని వారు చెబుతున్నారు క‌దా? అని గుడ్డిగా ఆ న్యూట్రిష‌న్ ఫుడ్‌ను ఫాలో కాకండి. ఎందుకంటే ప‌లువురు జిమ్ నిర్వాహ‌కులు ధ‌నార్జ‌నే ధ్యేయంగా యువ‌కుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నార‌నే చెప్పాలి ఈ కేసుతీరు విన్నాక‌!

ప‌శువుల కోసం వాడే స్టెరాయిడ్స్

పోలీసులు స్టెరాయిడ్స్ అమ్మ‌కాల‌పై వ‌చ్చిన స‌మాచారం మేర‌కు నిఘా ముమ్మ‌రం చేశారు. ఇందులో భాగంగా బంజారాహిల్‌లో ఉన్న ఏ1 షాప్‌లో నిషేధిత (ప‌శువుల శారీర‌క పెరుగుద‌ల కోసం) స్టెరాయిడ్స్‌ను వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకోవ‌డ‌మే గాకుండా ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ప‌ట్టుబ‌డిన స్టెరాయిడ్స్ విలువ రూ. 14 ల‌క్ష‌లు విలువ చేస్తుంద‌ని పోలీసులు తెలిపారు. ప‌శువుల కోసం వాడే స్టెరాయిడ్స్‌ను అంత‌ర్జాతీయంగా ఆన్‌లైన్‌ల ద్వారా త‌క్కువ ధ‌ర‌ల‌కే ఈ ఇద్ద‌రు వ్య‌క్తులు కొనుగోలు చేస్తూ జిమ్‌కు వ‌చ్చే వారికి ఎక్కువ ధ‌ర‌కు అమ్ముతూ వారిని మ‌భ్య‌పెడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. కాగా పోలీసులు వీరిద్ద‌రిని అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

Related posts

Protest: కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకించండి

Satyam NEWS

అంగన్వాడి లకు భీమా సౌకర్యం కల్పించాలి

Satyam NEWS

ఓటును నమోదు చేసుకున్న శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

Leave a Comment