30.7 C
Hyderabad
May 5, 2024 04: 58 AM
Slider ప్రత్యేకం

వచ్చే నెల 17న కొత్త సెక్రటేరియేట్ ప్రారంభం

#new secretariat

నూతనంగా నిర్మించిన..డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా, వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17 వ తేదీ, శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 గం.ల నడుమ నిర్వహించనున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

ప్రారంభోత్సవానికి ముందు, ఉదయం.. వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వినీ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జెడియు జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డా. బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితర ముఖ్యులు పాల్గొంటారు.

సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత మధ్యాహ్నం, సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సచివాలయ ప్రారంభోత్సవం లో పాల్గొన్న పైన పేర్కొన్న ముఖ్య అతిథులందరూ పాల్గొంటారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

Related posts

ఎమ్మెల్యేగా గెలిచి నీవు చేసిందేంది సైదిరెడ్డి?

Satyam NEWS

చిదంబరం లాంటి వాళ్లు నిజాలు చెప్పరు

Satyam NEWS

సొంత నిధులతో 108 వాహనం మంత్రి ఉదార‌త‌

Sub Editor

Leave a Comment