27.7 C
Hyderabad
May 4, 2024 07: 53 AM
Slider ముఖ్యంశాలు

కరోనా మహమ్మారితో మధుమేహ రోగులకు పెనుముప్పు

#Dr.Mohan's

మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి కొవిడ్-19 మహమ్మారితో 50 శాతం అధికంగా ముప్పు పొంచి ఉంది. కొవిడ్ – 19 పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలిన వారికి మధుమేహం ఉంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఇటీవల నిర్వహించిన ఓ సర్వే నిగ్గు తేల్చింది.

హైదరాబాద్ నగరంలో నిర్వహించిన సర్వే ప్రకారం భాగ్య నగర జనాభాలో 17.6 శాతం మంది మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారు. వారిలో సగటున 8.49 శాతం మంది హెచ్ బీఏ1సీ స్థాయి సమస్యలతో బాధపడుతున్నారని జనవరి-మార్చి మధ్య ఇండియా డయాబెటిక్ కేర్ ఇండెక్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.

మధుమేహ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి

ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మధుమేహంతో బాధపడుతున్న వారు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ సర్వే సంకేతాలనిస్తున్నది. మధుమేహ రోగులు తమలో గ్లూకోజ్ స్థాయిపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతోపాటు తమ పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు సరైన వైద్యం పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మోహన్ డయాబెటిక్ స్పెషాలిటీస్ సెంటర్ చైర్మన్ అండ్ చీఫ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వీ మోహన్ మాట్లాడుతూ ‘డయాబెటిక్ నియంత్రణకు సరైన, సమర్థవంతమైన వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొవిడ్-19 ప్రభావాన్ని కనీసస్థాయికి తీసుకొచ్చేందుకు మధుమేహ రోగులు మరింత అప్రమత్తంగా ఉంటూ వైద్యులు రాసిన ఔషధాలను నిరంతరం వాడుతూ ఉండాలి.

జీవ క్రియను మెరుగ్గా నియంత్రణలోకి తేవాలంటే ఇన్సులిన్ వాడటమే సురక్షితమైన చాయిస్. టైప్ 1 మధుమేహం రోగులు ప్రత్యేకించి పేద రోగులు సోలో థెరపీ, టైప్ 2 మధుమేహం రోగులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలి. ప్రస్తుతం ఇన్సులిన్‌ను చౌకధరకే అందుబాటులోకి తేవడం స్వాగతించదగిన పరిణామం.

జీవక్రియపై నియంత్రణ ఉంటే కోవిడ్ సోకే అవకాశాలు తక్కువ

నోవో నోర్డిస్క్ ఇండియా తన ర్యెజోడెగ్ ఔషధం ధర తగ్గించడం వల్ల భారత దేశంలో 30 శాతం మంది మధుమేహ రోగులకు సాయ పడుతుంది. జీవక్రియపై మంచి నియంత్రణ కలిగి ఉన్న వారికి కొవిడ్-19 సోకే అవకాశాలు తక్కువ’ అని అన్నారు. ఈ సర్వేను బన్సాల్ అనే సంస్థ నిర్వహించింది.

మధుమేహంతో బాధపడుతున్న వారిలో మధుమేహం రోగుల్లో రెండు రెట్లు, గుండె, నాడీ వ్యవస్థలో ఆరోగ్య సమస్యలు గల వారిలో మూడు రెట్లు కొవిడ్-19 సోకే అవకాశాలు ఎక్కువ. డయాబెటిక్ రోగుల్లో గుండె జబ్బులు సోకే ముప్పు పెరుగుతుందని ఈ సర్వే పేర్కొంది.

పౌష్టికాహారంతో కొంత వరకూ సేఫ్

మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు వైద్యంతోపాటు పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వారి గ్లూకోజ్ లెవెల్స్ నిరంతరం పరీక్షించుకోవాలి. వృద్దులు కొవిడ్-19కు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక వారు తమ కదలికలపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇళ్లకు పరిమితమై ఉండటంతోనే కరోనా ముప్పును నివారించవచ్చు.

Related posts

డబుల్ ధమాకా: వైసిపికి చెంప దెబ్బ టిడిపికి గోడ దెబ్బ

Satyam NEWS

గుడ్ మూవ్: మహిళా పోలీసులకు అదనపు సౌకర్యాలు

Satyam NEWS

కోనసీమ సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రి మురుగన్ హామీ

Satyam NEWS

Leave a Comment