33.2 C
Hyderabad
May 15, 2024 22: 59 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి 27వ వార్డులో త్రాగునీటిలో మురికి నీరు

#drainwater

వనపర్తి మున్సిపాలిటీ 27వ వార్డు సాయినగర్ కాలనీలో పాత నల్ల పైపుల ద్వారా మురుగు నీరు కలుషితమై నల్లల ద్వారా వస్తుందని ప్రజలు తెలిపారు. మునిసిపల్ అధికారులకు తెలిపినా చర్యలు లేవన్నారు. పాత 4 అంగుళాల మెయిన్  పైపులను తొలగించి కొత్త 6అంగుళాల మెయిన్  పైపులను వేస్తున్నామని 15 రోజుల క్రితం మెయిన్ పైపులను తొలగించారని కాలనీ వాసులు తెలిపారు.  పైపులను వేయడానికి తవ్విన కాల్వ పక్కనే మురికి ఉండడంవల్ల మురుగునీరు తవ్విన కాల్వలోకి చేరి ఆ నీటిలో  కప్పలు, చిన్న చిన్న పురుగులు, దోమలు, ఈగలు చేరడం వల్ల  చెడు వాసన ఉందన్నారు. తొలగించిన పాత పైపుల స్థానంలో కొత్త పైపులు వేసి కాలనీలో  మంచినీటి సౌకర్యం కల్పించాలని కాలనీవాసులు కోరారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం..!

Satyam NEWS

ఓ పోరాట యోధుని విజయం

Satyam NEWS

Tragedy TDP: తొక్కిసలాటలో ముగ్గురు మృతి

Satyam NEWS

Leave a Comment