38.2 C
Hyderabad
May 3, 2024 21: 45 PM
Slider ముఖ్యంశాలు

ఓ పోరాట యోధుని విజయం

#kalwakurthy

దాదాపు12 సంవత్సరాల పాటు పోరాడిన యోధుడు ఒక సామాజిక కార్యకర్త చివరకు విజయం సాధించిన ఘటన కల్వకుర్తి పట్టణంలో   చోటుచేసుకుంది. సప్రియ ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ హఫీజ్ 2012 వ సంవత్సరం నుండి ప్రభుత్వ భూమిని తన పోరాట చాతుర్యంతో ప్రభుత్వానికి చెందే విధంగా గట్టి పోరాటం చేశారు. చివరకు దాదాపు 12 సంవత్సరాల పాటు పోరాడి విజయం సాధించారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 51 ఏ ప్రకారం ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ సంపాదన కాపాడడం భారత పౌరుడి వీధి అని ఒక బాధ్యత యుతంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా పలువురు రాజకీయ నాయకుల బెదిరింపులకు లొంగకుండా ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేశారు.

కోట్ల విలువ గల పురపాలక సంఘానికి చెందిన ప్లాట్లు అన్యకాంతమయ్యాయి. ఇట్టి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు చెల్లించకపోవడంతో లోకాయుక్తను ఆశ్రయించారు.3 .12 .2022. రోజు గౌరవ తెలంగాణ లోకాయుక్త ఉత్తర్వులు జారీ చేసింది.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో సర్వే నెంబర్ 99/ 3 లో పురపాల శాఖకు చెందిన  35/1నెంబర్ గల ప్లాటును విద్యుత్ కార్మిక భవనం నిర్మాణం చేపట్టారు.

35 నెంబర్ గల ప్లాటు పాతర్ల రామాంజనేయులుకు 2009 లో ఈ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అప్పటి గ్రామపంచాయతీ  కార్యదర్శి పై తెలంగాణ రాష్ట్ర రివైజ్డ్ పెన్షన్ రూల్ 1980 (9) సబ్ రూల్స్ ( 2) బి ప్రకారం చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీకి చెందిన అన్యక్రాంతమైనభూమిని తిరిగి స్వాధీనపరచుకోని అక్రమార్కులైనా ,పి జెడ్ విల్సన్, వీ రెడ్డి మధుసూదన్ రెడ్డి,కే శ్రీనివాసులు, ఏడి నవీన్ కుమార్ ఈ నలుగురిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా కలెక్టర్ నాగర్ కర్నూల్ ఇరువురికి గౌరవ తెలంగాణ లోకాయుక్త ఆదేశాలు జారీ చేశారు.

లోకాయుక్త ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ శనివారం బండల సంధ్యారాణి భర్త బండల సుధాకర్ రెడ్డి అక్రమంగా రాత్రి వేళలో బోరు వేయడానికి ప్రయత్నించగా ఫిర్యాదుదారుడు అబ్దుల్ హఫీజ్ గమనించి పురపాలక కమిషనర్ ఆశ్రిత్ కుమార్ కు చేరవాణిలో సమాచారం అందించగా 300 ఫీట్లు వేసిన తర్వాత  పోలీసు వారి సహకారంతో నిలుపుదల చేశారు. కోట్ల విలువ గల భూమిని అన్యాక్రాంతం కాకుండా పోరాడిన పోరాటయోధుడికి పట్టణవాసులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

Related posts

వ్యభిచారం కేసులో జబర్దస్త్ గేమ్ షో నటులు

Satyam NEWS

Good Word : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి

Satyam NEWS

లాఠీలు పక్కన పెట్టి… ప్లకార్డులు పట్టుకుని “క్లాస్” చెబుతున్నఖాకీలు…!

Bhavani

Leave a Comment