34.2 C
Hyderabad
May 11, 2024 22: 46 PM
Slider ముఖ్యంశాలు

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం..!

#accident

కంటకాపల్లి వద్ద రెండు రైళ్లు ఢీ..దాదాపు 30 మంది మృతి?

కొద్ది నెలద క్రితమే….భువనేశ్వర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం మరువక మునుపే విజయనగరం జిల్లా లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విజయనగరం సమీపంలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సహాయక చర్యలకు అధికారులకు ఆదేశించారు.వివరాల్ వెళితే జిల్లాలో కంటకాపల్లి వద్ద రెండు రైళ్లు ఢీకొన్నాయి. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం. ప్రమాదపు వివరాలను సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లినుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మంచి వైద్య అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు.

Related posts

Danger level: వరద భయంతో…..గుట్టలపై గుడారాలు

Satyam NEWS

గణేశ్‌ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్

Bhavani

ధర్మ ఛత్రం

Satyam NEWS

Leave a Comment