28.7 C
Hyderabad
May 6, 2024 01: 15 AM
Slider పశ్చిమగోదావరి

స్కూలు మానేసిన వారిని తిరిగి చేర్చాలి

#MPDO Ganji Raj Manoj

ఏలూరు జిల్లా పెదవేగి మండలం లో వివిధ కారణాలతో చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను గుర్తించి వారిని డ్రాప్ ఎన్రోల్ మెంట్ పథకం ద్వారా 100 కి100 శాతం తిరిగి బడిలో చేర్పించేలా చర్యలు చేపట్టాలని పెదవేగి ఎం పి డి ఓ గంజి రాజ్ మనోజ్ సచివాలయాల వెల్పేర్ అసిస్టెంట్లను, వాలంటీర్ లను ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయం లో మంగళవారం ఉదయం ఎం పి డి ఓ వెల్పేర్ అసిస్టెంట్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భం గా ఎం పి డి ఓ గ్రామాల వారిగా ఉన్న డ్రాప్ ఔట్స్ వివరాల నివేదికల రూపం లో అందజేయాలని వెల్పేర్ అసిస్టెంట్లను ఆదేశించామని చెప్పారు.మండలం లో మొత్తం 1వెయ్యి960 మంది డ్రాప్ ఔట్స్ ఉన్నట్టు గుర్తించారని ఎం పి డి ఓ అన్నారు. 10వ తరగతి పాస్ ఐ పై చదువులకు వెళ్ళని వారిని పెయిల్ అయిన వారిని మొత్తం 340 మందిని, ఇంటర్ పాస్ అయిన 125 మంది తో బాటు 18 ఏళ్ళు నిండిన కొంత మందిని డ్రాప్ ఔట్స్ గా చూపించారని తెలిపారని చెప్పారు. వీళ్ళలో 575 మంది వివిధ పాఠశాలల్లో చదువుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారని అన్నారు.

వాలంటీర్లు చూపిన డ్రాప్ ఔట్స్ ని ఫిల్టర్ చేయగా ఇంకా 1100 మంది డ్రాప్ ఔట్స్ గా లెక్కలు చూపించారన్నారు. వాస్తవాలకు విరుద్ధం గా ఉన్న ఈ నివేదికను పునః పరిశీలించి ఖచ్చిత మైన డ్రాప్ ఔట్స్ రిపోర్ట్ ను రూపొందిస్తామని చెప్పారు. డ్రాప్ ఔట్స్ గా గుర్తించిన వారిని తిరిగి బడిలో చేర్పించడం చేస్తామని లేదా వారికి ఇష్టమైన స్కిల్స్

నేర్పించడం, ఓపెన్ స్కూల్స్ లో చేర్పించి వారందరికీ ఉజ్వల భవిష్యత్ కల్పించాలని జిల్లా కలెక్టర్ వె ప్రసన్న వెంకటేష్ ముఖ్య ఉద్దేశమని ఎం పి డి ఓ అన్నారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఇద్దరు ఎం ఈ ఓ లతో సమన్వయం చేసుకుని ఎం పి డి ఓ రాజ్ మనోజ్ పర్య వీక్షించారు.

Related posts

పుష్యరాగం

Satyam NEWS

వీధి బాలలకు బ్లాంకెట్స్ అందచేసిన అనురాగ్ హెల్పింగ్ సొసైటీ

Satyam NEWS

ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గ్రామ వాలంటీర్

Satyam NEWS

Leave a Comment