37.2 C
Hyderabad
May 2, 2024 12: 46 PM
Slider కవి ప్రపంచం

పుష్యరాగం

#NutenkiRavindraSankranti

క్షణక్షణానికో

రాగ మెత్తుకుంటుంది

కాలం

ఋతువు ఋతువుకో

వర్ణచిత్రాన్ని గీస్తుంది

కాలం

తన గమనాన్ని

మార్చుకున్నప్పుడల్లా

సరికొత్త కృతిని రచిస్తుంది ప్రకృతి

మకర సంక్రమణ వేళ

మంగళ తోరణాలు కడుతుంది

రంగవల్లికలతో తెలుగు లోగిలి

భోగభాగ్యాలను

ప్రసాదించే భానుడికి

భోగిమంటలు స్వాగతం పలుకుతాయి

గొబ్బిపాటలు సుప్రభాతం పాడుతాయి

గాదెల్లో నిండిన ధాన్యరాశి

పిండివంటల నైవేద్యం పెడుతుంది

కవుల వర్ణనల్లో

తీగసాగిన కవితాక్షరాల్లోనో

చిత్రకారుని కుంచె జాల్వార్చిన

వర్ణచిత్రాల్లోనో

వెండితెర వెలుగుల్లోనో

బుల్లితెర జిలుగుల్లోనో శిల్పారామాల్లోనో

చిందేసే కళారూపాల్లోనో తప్ప

కనిపించని

హరిదాసుల్నీ గంగిరెడ్లనీ

బుడబుక్కలోల్లనీ బాలసంతుల్నీ

అంతరించిపోతున్న సంస్కృతీ సంప్రదాయాల్నీ తలచుకొని

పాత తరం నాస్టాల్జియాని నెమరేస్తుంటే

కొత్త తరం కొంగ్రొత్త ఆశల గాలిపటాల్ని అంతరిక్షాన ఎగరేస్తుంది

కాలమెప్పుడూ

ముందుగామే కానీ మందగామి కాదు.

నూటెంకి రవీంద్ర, లక్షెట్టిపేట ఫోన్: 9491533295

Related posts

ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలి

Satyam NEWS

నాసా వ్యోమగామి శిక్షణకు భారత సంతతి వ్యక్తి ఎంపిక

Sub Editor

వనపర్తిలో ఆసుపత్రి, ల్యాబులు తనిఖీ

Satyam NEWS

Leave a Comment