39.2 C
Hyderabad
April 28, 2024 14: 35 PM
Slider వరంగల్

వీధి బాలలకు బ్లాంకెట్స్ అందచేసిన అనురాగ్ హెల్పింగ్ సొసైటీ

#anuraghelpingsociety

చలికాలం చలి ఎక్కువగా ఉండడంతో వరంగల్ లోని డాన్ బాస్కో వీధి బాలలకు, అనాథ బాలల వసతి గృహంలోని పిల్లలకు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో డా.కె.అనితారెడ్డి బ్లాంకెట్స్ అందచేశారు. రగ్గులతో బాటు పిల్లలందరికి పండ్లు కూడా అందించారు. ఈ సందర్భంగా కె.అనితారెడ్డి మాట్లాడుతూ మానవ సేవ మాధవసేవ అని అన్నారు. పిల్లలు చలికి ఇబ్బందులు పడుతున్నారని, తగిన మేర సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం రగ్గులు, దుప్పట్లు పేద, అనాథ, వృద్ధులకు, దివ్యాంగులకు తమ సంస్థ ద్వారా అందిస్తామని తెలిపారు. పిల్లలకు చదువుతోపాటు మంచి విలువలు కూడా నేర్పించాలని, పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె కోరారు. జువెనలం జస్టిస్ ఆక్ట్ నిబంధనలు తప్పక పాటించాలని, పిల్లల కేర్ ఆండ్ ప్రొటక్షన్ లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్వహకులకు, సిబ్బందికి తెలియజేశారు. పిల్లల పాటలు, డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనితారెడ్డి తో బాటు దివ్య, శారద, సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.

Related posts

కొమ్ము కోయ కళాకారులతో డ్యాన్సు చేసిన రాహుల్ జీ

Bhavani

వాట్ యాన్ ఐడియా సర్ జీ: ఏటీఎం మిషనే ఎత్తుకెళ్లారు

Satyam NEWS

హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా కెటీఆర్ జన్మదినం

Satyam NEWS

Leave a Comment