జాతీయ స్థాయి మెడికల్ (UG) ప్రవేశ పరీక్ష నీట్ కు సంబంధించిన విశ్లేషణాత్మ సమగ్ర సమాచారాన్ని బుక్ లెట్ రూపంలో విడుదల చేయనున్నట్లు ఫోరం ఫర్ నీట్ కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు. 70 పేజీలు గల ఈ -బుక్ లో గత నీట్ కట్ అఫ్ మార్కులు, రిజర్వేషన్స్ వారీగా మెడికల్ కళాశాల్లో సీట్లు కేటాయింపు వివరాలు ఉంటాయి.
అదే విధంగా ఈ-బుక్ లో ప్రముఖ శిక్షణా సంస్థల ఫైనల్ ప్రిపరేషన్ వ్యాసాలు కూడా ఉంటాయి. నీట్ పై ఎన్నో అపోహలు ఉంటాయి కాబట్టి వాటిని దూరం చేసేందుకు సమగ్ర సమాచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రుల అవగాహనా కోసం ఈ -బుక్ ను వాట్సాప్ ద్వారా ఉచితంగా అందిచనున్నట్లు లలిత్ కుమార్ తెలిపారు.