29.7 C
Hyderabad
May 6, 2024 04: 18 AM
Slider వరంగల్

వృద్ధులను చిన్నపిల్లల్లా కాపాడుకోవాలి

#anuraghelpingsociety

అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ కె అనితారెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండ బీమారం దగ్గరలోని లార్డ్ వృద్ధాశ్రమానికి బియ్యం తదితర నిత్యావసరాలను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె అనితారెడ్డి మాట్లాడుతూ వృద్ధుల సౌకర్యార్ధం ఈ కార్యక్రమం చేశామని అన్నారు.

వృద్ధులను చిన్న పిల్లల్లా ఆదరించి ప్రేమను పంచాలని ఆమె తెలిపారు. ఎవరికి వృద్ధాప్యం శాపంగా మారకూడదని డాక్టర్ అనితారెడ్డి తెలిపారు. వృద్ధాశ్రమాలు పెరగడం అంటే మానవ విలువలు తగ్గడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. తోచిన మేరకు సహాయ సహకారాలు అందించడానికి అనురాగ్ సొసైటీ ముందుంటుందని ఆమె ప్రకటించారు.

వృద్ధులకు సమయం కేటాయించడం, వారితో గడపడం చాలా సంతోషాన్ని తృప్తిని అందించిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారెడ్డితో బాటు నారగాని నరేష్ గౌడ్, ధనలక్ష్మి పాల్గొన్నారు.

Related posts

హుజూర్ నగర్ ఇండస్ట్రియల్ పార్కు భూమి పరిశీలన

Satyam NEWS

వైద్య శిబిరాలు పేదలకు వరం: కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Satyam NEWS

పోలింగ్ స్టేషన్లపై అభ్యంతరాలకు రేపటి వరకూ గడువు

Satyam NEWS

Leave a Comment