33.2 C
Hyderabad
May 4, 2024 01: 01 AM
Slider నల్గొండ

విద్య,వైద్యం ప్రభుత్వ బాధ్యత: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

#alugubelli

విద్య,వైద్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే బాధ్యతగా నిర్వర్తించాలని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హుజూర్ నగర్ నియోజకవర్గ నూతన కమిటీ సన్నాహక సమావేశములో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్య,వైద్యం కూడా ప్రైవేటు పరం చేయాలన్న దురుద్దేశంతో విద్య, వైద్యంలో ఉన్న సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వపరంగా చేయాల్సిన బాధ్యతను విస్మరించి ప్రైవేటు వైపు మొగ్గు చూపడం వల్ల ఇప్పటికే ప్రైవేటు రంగంలో నడుస్తున్న దోపిడీతో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అధిగమించడానికి ప్రభుత్వ పూర్తి బాధ్యత తీసుకొని విద్య,వైద్య రంగాన్ని మెరుగు పరిచేలా చేసే ప్రయత్నం తెలంగాణ పోరు స్పందన వేదిక ద్వారా ఒక శక్తిగా రాష్ట్రస్థాయిలో ఉద్యమించేందుకు వేదిక ద్వారా ముందుకు నడవాలని కోరారు.

హుజూర్ నగర్ నూతన కమిటీ అధ్యక్షుడుగా పిన్నప్ప రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కడియాల రమేష్, కోశాధికారిగా రామావతార నాయక్, కమిటీ సభ్యులుగా సింగ మోహనరావు, చేకూరి లిల,దగ్గుపాటి బాబురావు, సైదులు, రవి, ఆదినారాయణ సభ్యులు ఎన్నికైనారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ధనమూర్తి, మంగ, జిల్లా కార్యదర్శి బిక్షపతి,సుంకర క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

బీడీ కార్మికులకు అభయ హస్తం పింఛన్ ఇవ్వాలి: CPM డిమాండ్

Satyam NEWS

ఉత్కంఠభరిత సన్నివేశాల చిత్రీకరణలో విజయ్ సేతుపతి ‘విడుతలై’

Satyam NEWS

ఎన్నికల కంట్రోల్ రూమ్ తనిఖీ

Satyam NEWS

Leave a Comment