28.7 C
Hyderabad
April 28, 2024 10: 40 AM
Slider ఖమ్మం

ఎన్నికల కంట్రోల్ రూమ్ తనిఖీ

#vpgowtam

కలెక్టరేట్ లోని ఎన్నికల కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్ కి వచ్చే ఫిర్యాదులు, చేపడుతున్న చర్యలను పరిశీలించారు. కంట్రోల్ రూమ్ లో ప్రదర్శించిన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎంసిసి, ఎఫ్ఎస్టి, ఫ్లయింగ్ స్క్వాడ్ టీముల వివరాలు, సంప్రదించాల్సిన నెంబర్లతో సహా ఉన్న ఫ్లెక్సీలను పరిశీలించారు. సి విజిల్ యాప్, 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, పరిష్కార వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటి వరకు సి విజిల్ యాప్ ద్వారా 72 ఫిర్యాదులు రాగా, పరిష్కరించినట్లు, 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా 343 కాల్స్ వచ్చినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారి ద్వారా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, సిసి కెమెరాలు అమర్చినట్లు, అట్టి సిసి కెమెరాలను కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా పెట్టాలన్నారు. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1950, 9063211298 లకు కాల్ చేసి ఫిర్యాదులు, సందేహాలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, సిపిఓ ఏ. శ్రీనివాస్, కలెక్టరేట్ పర్యవేక్షకులు మదన్ గోపాల్, రంజిత్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Related posts

ఆసిఫాబాద్ జిల్లాను అతలాకుతలం చేస్తున్న వాన

Satyam NEWS

మామిడి రైతులకు మనోవేదన

Bhavani

ఐపీఎల్ వేలమా? ధర్మకర్తల మండలి సమావేశమా?

Satyam NEWS

Leave a Comment