Slider ఖమ్మం

అర్హులైన వారు ఓటర్ గా నమోదు చేసుకోవాలి

#Eligible candidates

18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.ఓటు హక్కు, ఓటరుగా నమోదుపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 5కే రన్‌ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలసి పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ జెండా ఊపి ప్రారంభించారు.నగరంలోని పటేల్ స్టేడియం నుండి ప్రారంభమమైన 5కే రన్‌ వైరా రోడ్డు మీదుగా లకారం ట్యాంక్ బండ్ వరకు కొనసాగింది.

ఓటు హక్కు ప్రాధాన్యత, 18ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు కావడం, ఎన్నికల్లో ఓటు హక్కు నియోగించుకోవడం తదితర అంశాలపై 5కే రన్‌ సందర్భంగా అధికారులు అవగాహన కల్పించారు. లకారం ట్యాంక్ బండ్ పై ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలతో పాటు వీవీప్యాట్స్‌ ఏర్పాటు చేసి ఓటు ఏ విధంగా వేయవచ్చో అవగాహన కల్పిస్తున్నారు.

ప్రధానంగా ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చి ఓటింగ్‌ శాతం పెరగడానికి ఉపయోగపడేలా జిల్లా అధికారులు కృషి స్తున్నారు. 5కే రన్‌ సందర్భంగా ఉద్యోగులు, యువతీ యువకులు, కళాశాలల విద్యార్థులు, స్పోర్ట్స్‌, వాకర్స్‌ అసోసియేషన్ల సభ్యులు, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌ సిబ్బంది, కలెక్టరేట్‌ అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు. ర్యాలీ సందర్బంగా ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకొన్నారు.

ర్యాలీలో పాల్గొనే వారికి తాగునీటి సదుపాయం కల్పించారు.ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమీషనర్ మాట్లాడుతూ.. ఓటరు నమోదుకు ఆన్ లైన్ ద్వారా గాని ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు పక్రియను ప్రచురణ ప్రతులను పంపిణీ చేసి విస్తృత ప్రచారం చేసినట్లు లిపారు.ఏసీపీలు గణేష్, ప్రసన్న కుమార్, సారంగపాణి, నర్సయ్య పాల్గొన్నారు.

Related posts

రాజకీయ నేపథ్యంలో వస్తున్న సర్కారువారి పాట

Satyam NEWS

తెలంగాణ మిడ్ వైఫరీ వ్యవస్థకు ఐక్యరాజ్యసమితి ప్రశంసలు

Satyam NEWS

కేంద్రంపై పోరు ఉధృతం

Sub Editor 2

Leave a Comment