29.7 C
Hyderabad
May 4, 2024 03: 38 AM
Slider నిజామాబాద్

దళితులకు మూడెకరాల భూమి వెంటనే పంచాలి

#Arunatara MLA

దళితులకు మూడు ఎకరాల భూమిని పంచి అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని జుక్కల్ మాజీ శాసనసభ్యురాలు అరుణతార డిమాండ్ చేశారు. శుక్రవారం బిచ్కుంద తహసీల్దార్ వెంకట్రావుకు  భాజపా నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ  అవసరం లేకున్నప్పటికీ సచివాలయంను  కూల్చివేసి పబ్బం గడుపుకుంటున్నారని కరోనా వైరస్ పేరిట తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు తప్పించుకు తిరుగుతున్నారన్నారు.తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అర్హులైన దళితులకు మూడెకరాల భూమిని పంచి డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్నారు.

జుక్కల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ప్రారంభం కాలేదని ఆమె ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు స్పందించి పైన పేర్కొన్న  డిమాండ్లను పరిష్కరించాలని లేని ఎడల భాజపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అమెతో పాటు పార్టీ మండల అధ్యక్షులు కిష్టారెడ్డి ప్రధాన కార్యదర్శి పత్తి రమేష్ నాయకులు శ్రీధర్ ,పంతులు పసికే ప్రకాష్ సందీప్ తదితరులున్నారు.

Related posts

విజయనగరం ఆర్మర్డ్ రిజర్వు ఆఫీసు లో గణతంత్ర వేడుకలు

Satyam NEWS

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Satyam NEWS

Heats off: వృద్దురాలికి ఆశ్ర‌యం క‌ల్సించిన ఏటీకే సంస్థ‌…!

Satyam NEWS

Leave a Comment