39.2 C
Hyderabad
April 30, 2024 20: 26 PM
Slider విజయనగరం

Heats off: వృద్దురాలికి ఆశ్ర‌యం క‌ల్సించిన ఏటీకే సంస్థ‌…!

#vijayanagaramyouth

ప్రార్ధించే పెద‌వుల‌కన్నా..సాయం చేసే చేతులే మిన్న అన్న సామెత‌ను అక్ష‌రాల రుజువు చేసారు…మూడు విభాగాల‌కు చెందిన వ్య‌క్తులు. మ‌నిషి త‌ల‌చుకుంటే ఎలాంటి ప‌నినైనా..ఎలాంటి సహాయం అయినా చెయ్య‌గ‌ల‌ర‌ని మ‌రోసారి చూపించారు…ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌, మ‌రో  స్వ‌చ్చంద సంస్థ..దాంతో పాటు మ‌రో ఆశ్ర‌మం.

వివ‌రాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాల లో మీరు చూసిన‌ ఈ పెద్దావిడ గురించి ఎవరు బస్సు ఎక్కించి వదిలేశారు మార్గమధ్యంలో బస్సు డ్రైవర్   బొబ్బిలి బస్టాండ్ లో వదిలేశారు అని వ‌చ్చిన‌ మెసేజ్ విపరీతంగా వైరల్ అయింది ఈ పెద్దావిడ గురించి విజ‌య‌న‌గ‌రం కు చెందిన స్వ‌చ్చంద సంస్థ విజయనగరం యూత్   శత విధాలుగా ప్రయత్నాలు చేసింది. 

చివ‌ర‌కు  బొబ్బిలి ఇన్స్పెక్టర్ రైటర్ గా పని చేస్తున్న  హెడ్ కానిస్టేబుల్ గౌరీశంకర్, హోం గార్డ్ ఝాన్సీ ల‌ సహాయంతో ఆ పెద్దావిడను బొబ్బిలి నుండి తీసుకువ‌చ్చేందుకు   ప్రత్యేకమైన అంబులెన్స్ పంపించింది..విజ‌య‌న‌గ‌రం యూత్. ఆ పెద్దావిడ ను ఓ  వృద్ధాశ్రమంలో  పెట్టేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్న సమయంలో  న‌గ‌రంలోని డుబుల్ కాల‌నీ వ‌ద్ద ఉన్న ఏటీకే ఫౌండేషన్ అధ్యక్షులు ఖలీల్ బాబు  త‌మ‌ యొక్క వృద్ధాశ్రమంలో   చేర్చుకుంటాను దయచేసి మీరు ఇక్కడికి తీసుకు రండి అని చెప్పారు.

దీంతో ఆ పెద్దావిడ‌కు ఒ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించి నేరుగా ఏటీకే ఆశ్ర‌మంలో చేర్పించారు..విజ‌య‌న‌గరం యూత్ క్ల‌బ్. సో హేట్సాప్….బొబ్బిలి పోలీసులు…ఏటీకే సంస్థ‌,విజ‌య‌న‌గరం యూత్ క్ల‌బ్.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్

Related posts

ఏపీలో మరో వారం రోజులు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

Satyam NEWS

జూన్ 2 వరకు క్రమబద్దీకరణ

Murali Krishna

కరోనా ఎఫెక్ట్: ఆర్డినెన్సుతోనే ఏపి బడ్జెట్ ఆమోదం

Satyam NEWS

Leave a Comment