26.7 C
Hyderabad
May 3, 2024 09: 23 AM
Slider ముఖ్యంశాలు

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

#SrisailamPowerHouse

శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో భారీ ఆగ్ని ప్రమాదం జరిగింది. కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది సంఘటన సమయంలో భారీగా పెలుడు శబ్దాలు వచ్చాయి. పవర్ హౌస్ మొత్తం మంటలు పోగతో నిండిపోయింది. రాత్రి 10 :30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 

ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 6 జనరేటర్లు ఉన్నాయి. ఒకోక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లు మొత్తం రన్నింగ్ లో ఉన్నాయి. ప్రమాదవశాత్తూ మొదటిగా నాలుగో యూనిట్ ప్యానల్ బోర్డు లో షార్ట్ సర్క్యూట్ అయి భారీగా మంటలు చెలరేగాయి.

పవర్ హౌస్ మొత్తం పొగతో నిండుకు పోవటంతో డ్యూటిలో ఉన్న ఇంజనీర్లు కిందిస్దాయి సిబ్బంది భయాందోళనలకు గురై లోపల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులు పెట్టి కొందరు ప్రాణాలు కాపాడుకోగా మరో కొందరు ఇంజనీర్లు కిందిస్దాయి సిబ్బంది 9 మంది లోపలనే చిక్కుకుపోయారు.

విషయం తెలుసుకున్న తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఎస్ పి ఎమ్మెల్యేలు సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన ప్రమాదానికి గల కారణాలు లోపల ఎంతమంది చిక్కుకున్నారు ఎంత మంది బయటకు వచ్చారు అనే విషయాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు.

లోపల ఇరుక్కుపోయిన ఇంజనీర్లను సిబ్బందిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. లోపల 9 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించిన వారి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు కొందరు ఇంజనీర్ల సమాచారం. లోపల ఉన్న సిబ్బంది ఇంజనీర్లను కాపాడే ప్రయత్నంలో రెస్క్యూ టీమ్ ఉన్నారు.

ఎదిఏమైనప్పటికి భారి ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. పవర్ హౌస్ మొత్తం పొగతో నిండిపోవడంతో ప్రత్యేక బృందాలు వారిని కాపాడే ప్రయత్నంలో ఉన్నారు.

Related posts

ఖాకీల అదుపు లో గంజాయి స్మగ్లర్లు…!

Satyam NEWS

గార్మి పండుగ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సింగిరెడ్డి

Satyam NEWS

వాహనం నడిపేటప్పుడు డ్రస్ కోడ్ ఉండాలా?

Satyam NEWS

Leave a Comment