27.7 C
Hyderabad
May 4, 2024 09: 40 AM
Slider వరంగల్

నిత్యావసర సరుకులు పంచిపెట్టిన ఆశ్య ఫౌండేషన్

Aashya foundation

కరోనా వైరస్ ను నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ వల్ల తరిగొప్పుల మండలం, కొత్త తండా గ్రామ పంచాయతీకి చెందిన గిరిజన కుటుంబాలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గ్రహించిన ఆశ్య ఫౌండేషన్ అధ్యక్షుడు మధు,  అల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ హరిలాల్ సహకారంతో గ్రామంలోని అన్ని కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపింణీ చేశారు.

ఈ సందర్భంగా అల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ హరిలాల్ మాట్లాడుతూ కరోనా మహమ్మరి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు తీసుకున్న లాక్ డౌన్ కారణంగా రోజు వారీ కూలీ పనులు చేసుకొని జీవనోపాధి సాగిస్తున్న ప్రజలు,బయటికి వెళ్లలేక,కుటుంబం గడవడం కష్టమైన సంఘటనలు చూసి చలించి,గ్రామ పంచాయితీ పరిధిలోని అన్ని కుటుంబాలకు వారానికి సరిపడ కూరగాయలు,నిత్యావసర వస్తువులు పంపిణీ చేశానని తెలిపారు.

ప్రతి ఒక్కరూ ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో తోచినంత సహాయం చేసి పేద ప్రజలకు అండగా ఉండాలని కోరారు. అంతేకాక ప్రతీ ఒక్కరూ బాధ్యతగా సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, కరోనాను దరిచేరనివ్వకూడదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భులి యాదయ్య,పిఏసీఎస్ డైరెక్టర్ నాగపూరి కిషన్ గౌడ్,కార్యదర్శి రవీందర్, విఆర్వో జయాలు,వార్డు మెంబర్ లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సిసోడియా కు మళ్ళీ నిరాశే

Bhavani

కేంద్ర, రాష్ట్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం

Murali Krishna

రైతుల పంట రుణాలను రద్దు చేయాలి

Satyam NEWS

Leave a Comment