37.2 C
Hyderabad
May 6, 2024 12: 13 PM
Slider వరంగల్

బహిరంగంగా ఉమ్మివేస్తే కఠిన చర్యలు

Janagam collector

కరోనా మహమ్మారి విజృంభిస్తు నేపధ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయని వాటిని అందరూ అనుసరించాలని జనగామ కలెక్టర్ నిఖిల కోరారు. ప్రతి ఒక్కరూ చేతులను  సబ్బుతో సుమారు 20 సెకన్లు కడుక్కోవాలని లేదా శానిటైజర్లు ఉపయోగించాలని ఆమె కోరారు.

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటిని, ముక్కుని టిష్యూ పేపర్ తో లేదా మోచేతిని అడ్డం పెట్టుకోవాలని, చేతులు కడుక్కోకుండా కళ్ళను,ముక్కును,నోటిని  తాకరాదని సూచించారు. సామాజిక దూరం పాటించాలని,ఎక్కువ మంది ఒక్కే చోట కలవడం,చేతులు కలపడం,లాంటివి చేయకూడదన్నారు.

ప్రజలు బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతూ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా చూసుకోవాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధించామని, దీనికి సంబంధించి అధికారులు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు.

జనగామ జిల్లాలో బహిరంగంగా ఉమ్మి వేస్తే చట్టరీత్యా శిక్ష అర్హులుగా పరిగణిస్తామని ఆమె అన్నారు. ప్రతి వ్యక్తి విధిగా మాస్క్ పెట్టుకోవాలని కోరారు.

Related posts

అన్న‌దాత‌ సుభిక్షంగా ఉండాలి

Satyam NEWS

స్వంత ప్రాంతాన్ని మరువద్దు

Satyam NEWS

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు దుర్మ‌ర‌ణం

Sub Editor

Leave a Comment