40.2 C
Hyderabad
May 5, 2024 18: 20 PM
Slider నిజామాబాద్

500 కోట్లు ఇవ్వడానికి కేసీఆర్ కు చేతులు రాలేదు

#etala

విదేశాలకు వెళ్లే వారికోసం తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 500 కోట్లు కేటాయించామని ఆ నిధులు ఇవ్వడానికి కేసీఆర్ కు చేతులు రాలేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలోని అడ్లూర్, రామారెడ్డి, సదాశివనగర్, ఉత్తునూర్, మోతె గ్రామాల్లో  ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా చేపట్టిన స్ట్రీట్ కార్నర్ మీటింగులో ఆయన పాల్గొన్నారు.

కామారెడ్డి మండలం అడ్లూర్ గ్రామంలో పాల్గొన్న అనంతరం రామారెడ్డి వెళ్లిన ఆయనకు అక్కడి బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. బస్టాండ్ నుంచి కాలభైరవ స్వామి ఆలయం వరకు బైక్ ర్యాలీగా బయలుదేరారు. ఆలయంలో ఈటలకు ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాలీ మట్టిని నమ్ముకుని బ్రతుకుతున్నారని, ఇక్కడ విదేశాలకు వలసలు ఎక్కువగా ఉంటాయన్నారు.

తెలంగాణ వస్తే విదేశాలకు వలసలు ఆగుతాయని ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పారన్నారు. కానీ అనాధాలుగా శవాలుగా మారుతున్నారని, జైళ్లలో మగ్గుతున్నారన్నారు. విదేశాలకు వలసలు అపలేమని, వెళ్ళేవాళ్ళ కోసం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 500 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. కానీ కేసీఆర్ కు ఇవ్వడానికి చేతులు రాలేదని ఆరోపించారు.

విదేశాలకు వెళ్లాలని ఆసక్తి ఉన్నవారికి ప్రభుత్వమే ఏజంట్ ను నియమించి అక్కడి కంపెనీ వారితో మాట్లాడి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విదేశాలకు పంపే ఏర్పాట్లు చేయడం కోసం 500 కోట్లు కేటాయించామన్నారు. కానీ కేసీఆర్ అది చేయలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వమే రూపాయి ఖర్చు లేకుండా విదేశాలకు వెళ్లే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి భార్యాపిల్లలను చూసుకోవడానికి వచ్చేలా అక్కడి కంపెనీ ప్రతినిధులతో వెసులుబాటు కల్పిస్తామన్నారు.

దేశానికి నాణ్యమైన పంటలు అందించే జిల్లా నిజామాబాద్ జిల్లా అని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని నియంత్రిస్తా అని చెప్పిన కేసీఆర్ రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. ఓసారి మొక్కజొన్న వేయాలని, మరోసారి దొడ్డు బియ్యం పండించాలని, సన్నబియ్యం మాత్రమే వేయాలని రైతులను ఆగం చేశారన్నారు. రైతులు శాస్త్రవేత్తలు కావాలని, వారి పంటకు వారే ధరలు నిర్ణయించుకునేల రైతుల కోసం కట్టిన రైతు వేదికలకు తాళాలు ఉంటున్నాయని, మద్యం తాగేందుకు అడ్డాగా మారుతున్నాయని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇస్తున్నా నేను ఇస్తున్నా అని ప్రధాని మోడీ ఎప్పుడు చెప్పుకోలేదని, కేసీఆర్ మాత్రం నేనే ఇస్తున్నా అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నీ ఆస్తులు ఏమైనా అమ్మి ఇచ్చినవా.. ఫామ్ హౌస్ అమ్మి ఇచ్చినవా కేసీఆర్..? అని ప్రశ్నించారు. దేశంలో అత్యధికంగా మద్యం తాగే రాష్ట్రం తెలంగాణ అని గ్రామగ్రామాన బెల్టు షాపులు ఏర్పాటు చేసి తాగుబోతుల తెలంగాణగా మార్చారన్నారు. తాగే మద్యం సీసాలు అమ్మితే వచ్చే ఆదాయం 10,700 కోట్లని, మద్యం విక్రయం ద్వారా వచ్చే ఆదాయం 45 వేల కోట్లని తెలిపారు.

రైతుబందుకు 11 వేల కోట్లు, పింఛన్లను 15 వేల కోట్లు, కల్యాణ లక్ష్మికి 3500 కోట్లు మొత్తం కలిపినా 30 వేల కోట్లు కూడా కావడం లేదని, మద్యం ద్వారా 45 వేల కోట్లు ప్రభుత్వానికి ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 110 రూపాయలు పెట్రోల్ ధర ఉంటే అందులో 56 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తుందన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రశ్నిస్తే అభివృద్ధి కళ్ళకు కనిపించడం లేదా అంటున్నారని, కోడిగుడ్డుపై ఈకలు పికుతున్నారని ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు.

అసెంబ్లీలో జరిగే ప్రతిదీ ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 70 లక్షల మంది మహిళలకు 4200 కోట్ల సంఘాల రుణాలు ప్రభుత్వం బకాయి ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న వారికంటే నాణ్యమైన పాలన అందిస్తామని,  ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సుమారు 200 మంది ఈటల రాజేందర్ అద్వర్యంలో బీజేపీలో చేరారు.

Related posts

పడవ ప్రయాణం చేస్తే కఠిన చర్యలు తప్పవు

Satyam NEWS

ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మృతి

Bhavani

టూరిజం ప్రాంతాల్లో గో ఉత్పత్తుల విక్రయానికి స్టాల్స్ ఇప్పించాలి

Satyam NEWS

Leave a Comment