Slider ముఖ్యంశాలు

ఈవీఎం లపై పూర్తి అవగాహన ఉండాలి

#khammam

శాసనసభ సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, వి.వి ప్యాట్స్‌ వినియోగం తీరుపై  సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని, కమిషనింగ్‌లో చేయావలసిన విదులపై మాస్టర్‌ ట్రైనర్‌ శ్రీరాం తెలిపారు.  కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఐదు నియాజకవర్గాల సెక్టార్‌ అధికారులకు ఎలాక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌, వి.విప్యాట్స్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.   కమీషనింగ్‌లో బ్యాలెట్‌ యూనిట్‌లో బ్యాలట్‌ పేపర్‌ అమరిక, పోటీలో ఉన్న అభ్యర్థుల లిస్టు, మాక్‌పోల్‌ చేసి వచ్చిన ఏజెంట్లకు  మాక్‌పోల్‌ ఈవిఎం రిజల్ట్‌ సరిచేసి చూపించడం, ఇ.వి.ఎమ్‌లు, వి.వి.ప్యాట్స్‌ వినియోగం తీరుపై  అవగాహన కల్పించారు.  

పోలింగ్‌ ప్రారంభించుటకు  ముందు మాక్‌ పోలింగ్‌ నిర్వహించి క్లియర్‌ చేయాలన్నారు.  ఇ.వి.ఎమ్‌లు, వి.వి.ప్యాట్స్‌ కనెక్షన్లు సరిగా కనెక్ట్‌ చేసింది లేనిది సరిచూసుకోవాలన్నారు.  బ్యాలెట్‌ యూనిట్లు సెట్టింగ్‌ను తనిఖీ చేసుకోవాలన్నారు.  బరిలో ఉన్న అభ్యర్థుల బ్యాలెట్‌ పత్రాన్ని సరిగా అమర్చింది లేనిది సరిచూసుకోవాలన్నారు.  శిక్షణ అనంతరం  శిక్షకులు వీటికి సంబంధించిన మ్యాన్యువల్స్‌పై సంపూర్ణ అవగాహన కలిగి సిద్దంగా ఉండాలని అన్నారు.  ఇట్టి విషయాన్ని సీరియస్‌గా పరిగణించి విధులు నిర్వర్తించాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.  పోలింగ్‌ ప్రక్రియ, మాక్‌ పోలింగ్‌ ప్రక్రియను ఎలా చేయాలన్న పద్దతుల పై మాస్టర్‌ ట్రైనర్‌ శిక్షకులకు వివరించారు. శిక్షణ కార్యక్రమంలో అసిస్టెంట్‌ శిక్షణ కలెక్టర్‌ మాయంక్‌ సింగ్‌, నోడల్‌ అధికారి విజయనిర్మల, మాస్టర్‌ ట్రైనర్స్‌ కె.శ్రీరామ్‌, మదన్‌గోపల్‌, ఐదు నియోజకవర్గాల  సెక్టర్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉత్తరప్రదేశ్ లో మరో దళిత యువతిపై దారుణం

Satyam NEWS

అంగరంగవైభవంగా కొత్త సచివాలయం ప్రారంభోత్సవం

Bhavani

స్వీయ నిర్బంధమే కరోనా కు నివారణకు మార్గం

Satyam NEWS

Leave a Comment