33.7 C
Hyderabad
April 29, 2024 01: 34 AM
Slider ప్రత్యేకం

అంగరంగవైభవంగా కొత్త సచివాలయం ప్రారంభోత్సవం

#KTR

బీఆర్ఎస్ పార్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీ హాల్‌లో సమావేశమయ్యారు. ఈ నెల 17న జరిగే పరేడ్ గ్రౌండ్స్ సభపై మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ చర్చించారు. ఈ సభను విజయవంతం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. భారీ జన సమీకరణపై మంత్రులకు, ఎమ్మెల్యేలకు కేటీఆర్ పలు సలహాలు, సూచనలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయ భవనాన్ని ఈ నెల 17వ తేదీన ఉదయం 11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు, జార్ఖండ్‌ ముఖ్యమంత్రులు స్టాలిన్‌, హేమంత్‌సోరెన్‌, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి

తేజస్వీయాదవ్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్‌, అంబేద్కర్‌ మనుమడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ తదితర ప్రముఖులు పాల్గొంటారు. భవన ప్రారంభోత్సవానికి ముందు ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సచివాలయ ప్రారంభం తరువాత మధ్యాహ్నం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ సభలో సచివాలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యే ముఖ్య అతిథులంతా పాల్గొననున్నారు. సచివాలయ భవనానికి జూన్‌ 2019న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయగా.. అత్యాధునిక పద్ధతులు, సకల సౌకర్యాలతో మూడున్నరేండ్లలోనే అందుబాటులోకి రావడం విశేషం.

Related posts

అంబర్ పేట్ లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి

Satyam NEWS

రెడ్ క్రాస్ ములుగు జిల్లా కమిటీ ఎన్నిక

Satyam NEWS

కంకణం కట్టుకుందాం….కమలం పార్టీని గెలిపిద్దాం…

Satyam NEWS

Leave a Comment