కొల్లాపూర్ ప్రజలకు ముఖ్యంగా నియోజకవర్గంలో ఎంతో చురుకుగా ఉంటున్న యువకులకు మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జూపల్లి కృష్ణారావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సకల జనులూ జరుపుకునే దివ్యమైన దీపావళి పండుగ అందరి జీవితాలలో వెలుగు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ లో అందరూ ఆత్మగౌరవంతో బతకాలని అందుకోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తున్నదని ఆయన అన్నారు. కొల్లా పూర్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల జీవితాలలో ఈ దీపావళి వెలుగు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో పేదల సంక్షేమం నిరంతరంగా కొనసాగుతుందని అందుకోసం అహర్నిశలూ శ్రమిస్తానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియచేశారు.
previous post
next post