28.7 C
Hyderabad
April 27, 2024 05: 24 AM
Slider తెలంగాణ

4 నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు శిక్షణ

training for engineering students from 4 th

టీశాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్ల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్వాంటమ్‌ కాన్సెప్ట్‌, ఉద్యోగ అవకాశాలపై రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీఈవో ఆర్‌ శైలేష్‌రెడ్డి తెలిపారు. ఈనెల నాలుగో తేదీ నుంచి 15వ తేదీ వరకు పది రోజులపాటు శిక్షణ పాఠ్యాంశాలను ప్రసారం చేస్తామని పేర్కొన్నారు. ఈనెల నాలుగు నుంచి ఎనిమిదో తేదీ వరకు, 11 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రెండుగంటలపాటు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల ద్వారా పాఠ్యాంశాలను అందిస్తామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్ల శాఖ పరిధిలోని పొటానిక్స్‌ వ్యాలీ కార్పొరేషన్‌, టాస్క్‌, టీశాట్‌, ఐఐటీహెచ్‌, ఐఐఐటీహెచ్‌ సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమంలో ఐటీ దిగ్గజ సంస్థలు టీసీఐ, ఎంఫసిస్‌, అమేజాన్‌, కాపిటల్‌ లాజిక్‌, క్యూయూఎన్‌యూ ల్యాబ్స్‌ ప్రతినిధులతో క్వాంటమ్‌ టెక్నాలజీస్‌-ఎక్స్‌పోజర్‌ ట్రైనింగ్‌పై అవగాహన ప్రసారాలుంటాయని వివరించారు. దేశంలోని ప్రముఖ నగరాలైన ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌ వంటి ప్రధాన కేంద్రాల నుంచి పాల్గొనే కంపెనీల ప్రతినిధుల అనుభవాలను ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులతోపాటు ఆ చదువు పూర్తయిన విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవగాహన ప్రసారాలను వినియోగించుకోవాలని సూచించారు.

Related posts

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది కార్యకర్తలే

Satyam NEWS

తెలంగాణ ప్రజా ప్రతినిధుల్ని హతమార్చేందుకు మావోల ప్లాన్

Satyam NEWS

రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో నవతరోత్సవ్

Satyam NEWS

Leave a Comment