ఏజెన్సీ ప్రాంతం నుంచి ప్రతి రోజూ భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సంఘటనలు అరికట్టేందుకు పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేస్తూనే ఉన్నారు. భద్రాచలం టౌన్ పోలీసులు నేడు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో అనుమానం వచ్చి కార్లను తనిఖీ చేశారు. దాంతో భారీ ఎత్తున గంజాయి దొరికింది. రెండు కార్లలో సుమారు 15 లక్షల విలువచేసే 1000 కిలోల గంజాయిని భద్రాచలం టౌన్ పోలీసులు పట్టుకున్నారు. రెండు వాహనాలను , గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
previous post