కొల్లాపూర్ మండలం లోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో స్థానిక గాంధీ ఉన్నత పాఠశాలలో ప్రతిభా పరీక్షను నిర్వహించారు. పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు శోభా రాణి ప్రశ్నాపత్రాలను విడుదల చేసి పరీక్షలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ రామానుజన్ జన్మదినమైన డిసెంబర్ 22 పురస్కరించుకొని మండల స్థాయిలో ఈ పోటీ పరీక్ష నిర్వహించామని ఈ పోటీ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా స్థాయిలో ఈ నెల 14 న జరిగే ప్రతిభ పరీక్ష కు పంపిస్తామని అన్నారు.
గణితం పట్ల విద్యార్థుల లోపల ఉన్న భయాన్ని తొలగించి కష్టంగా కాకుండా ఇష్టంగా గణితాన్ని చేసే విధంగా విద్యార్థులను పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన డానికి జిల్లా గణిత ఫోరం ఆధ్వర్యంలో ప్రణాళికలు ఏర్పరుచుకొని ఈ కార్యక్రమం చేస్తున్నామని అన్నారు.
అన్ని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మండల గణిత ఫోరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోవింద్ గౌడ్, శివుడు గణిత ఉపాధ్యాయులు పాండు గౌడు రాఘవేందర్ గంగాధర్ లక్ష్మమ్మ పాల్గొన్నారు.