27.7 C
Hyderabad
May 16, 2024 06: 10 AM
Slider గుంటూరు

గుంటూరు జిల్లాలో అతి భారీ మద్యం డంప్

#Liquor Dump

గుంటూరు జిల్లా శావల్య పురం మండలం కారుమంచి గ్రామంలో పెద్ద ఎత్తున అక్రమ మద్యం డంప్ దొరికింది. ఎక్సయిజ్ పోలీసులు చేసిన ఈ దాడిలో మొత్తం 3 వేల 842 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్ల తో బాటు ఒక లారీ, టాటా ఏస్, ఆటో, మూడు బైకులు కూడా ఎక్సయిజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎక్సయిజ్ ఏఐ మాధవి తెలిపారు.

ఇందులో పోలీసు అధికారి పాత్ర ఉందని ఆమె వెల్లడించారు. ముద్దాయిలు అందరూ శావల్యా పురం మండలం కారుమంచి, వైకళ్ళు గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. ఈ మొత్తం ముఠా వెనుక పోలీసు అధికారితో బాటు ఒక రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఎక్సయిజ్ పోలీసులు ఈ అక్రమ మద్యం కూపీ మొత్తం లాగితే ఆ నాయకుడు కూడా బయటకు వస్తాడని అంటున్నారు.

Related posts

అర్చకుల సంఘీభావ సభ సుదర్శన పుస్తక ఆవిష్కరణ

Sub Editor

పెరిగిన ధరలు

Sub Editor 2

తెలంగాణా సాధించింది బిజెపి నేత సుష్మా స్వరాజ్

Satyam NEWS

Leave a Comment