37.2 C
Hyderabad
April 26, 2024 21: 30 PM
Slider మహబూబ్ నగర్

అర్చకుల సంఘీభావ సభ సుదర్శన పుస్తక ఆవిష్కరణ

Book Release

గద్వాల పట్టణంలోని భీంనగర్ లో ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అర్చకులకు సంఘీభావ సభ నిర్వ‌హించారు. ఈ సభలో శ్రీ వైష్ణవ సేవా పరిరక్షణ సమితి సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం శ్రీ వైష్ణవ పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో ఆరాధనలు నిర్వ‌హిస్తున్నారు. ఈ దేవాలయాన్నిమంత్రాలయం మఠంలో కలపడం శాస్త్ర విరుద్ధం. అంతేకాదు ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖలో రిజిస్టర‌యింద‌ని శ్రీవైష్ణవ ఆగమ పరిరక్షణ సమితి అధ్యక్షులు కిషోర్, యాదగిరి సభాముఖంగా తెలిపారు. ఈ సందర్భంగా సుదర్శనం అనే పుస్తకాన్నిముఖ్య అతిథులుగా అడ్వకేట్ BJP రాష్ట్ర నాయకులు వెంకటాద్రి రెడ్డి, BJP నాయకులు అయ్యపు రెడ్డిలు పాల్గొన్నారు. వెంకటాద్రి రెడ్డి పుస్తకాన్నిఆవిష్కరించారు.

ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేవాలయాన్నిఎప్పటిలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖలోనే వుంటుంద‌ని, భవిష్యత్తులో కూడా శ్రీవైష్ణవ సాంప్రదాయంలో పూజలు గతంలో వున్నట్లు గానే నిర్వహించే విధంగా బ్రహ్మోత్సవాలు గతంలో మాదిరిగానే జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని అని అర్చకులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ కౌండిన్య, ప్రధాన కార్యదర్శి శేషాచార్యులు, శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయ పరిరక్షణ సమితి అధ్యక్షులు యాదగిరి స్వామి ప్రధాన కార్యదర్శి కిషోర్ స్వామి ధర్మకర్త సంయుక్తమ్మ బూడిదిపాడు నారాయణ రెడ్డి వికాస తరంగిణి, సభ్యులు శ్రీనివాసులు చిన్న జీయర్ స్వామి శిష్యు బృందము వైష్ణవ భక్తులు పాల్గొన్నారు.

Related posts

పెద్దల సభకు మళ్లీ కేకే, కొత్తగా పొంగులేటి

Satyam NEWS

మహిళా దినోత్సవ సందర్భంగా కార్మిక మహిళలకు ఘన సన్మానం

Satyam NEWS

ముఖ్యమంత్రి సహాయ నిధికి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగుల విరాళం

Satyam NEWS

Leave a Comment