28.7 C
Hyderabad
April 27, 2024 05: 22 AM
Slider ముఖ్యంశాలు

పెరిగిన ధరలు

increased prices

దాదాపు ఐదు నెలల తర్వాత పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్  ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు, గ్యాస్ పై 50 రూపాయలు పెంచారు.. హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం ఆరుగంటల నుంచి పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే రోజురోజుకు చమురు సంస్థల నష్టాలు పెరుగుతుండడంతో పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచడం అనివార్యంగా మారినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరికొన్ని రోజుల పాటు చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలలకు ముందు భారత్‌లో చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 10, డీజిల్‌పై రూ. 5 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి పలు రాష్ట్రాలు సైతం వ్యాట్‌ను తగ్గించడంతో వినియోగదారులకు భారీ ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాలు మాత్రం వ్యాట్‌ను తగ్గించని విషయం తెలిసిందే.

ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.108.20 ఉండగా, డీజిల్‌ ధర రూ. 94. 62గా ఉంది. పెంచిన ధరలతో పెట్రోలు ధర రూ.109.10, డీజిల్‌ 95.49కు చేరింది. గ్యాస్ ధర కూడా 952 రూపాయల నుండి 1002 రూపాయలకు చేరింది.

Related posts

ఏఐసీసీలో భారీ ప్రక్షాళన

Sub Editor 2

కాళోజి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలి

Satyam NEWS

క్రైమ్: అనుమానాస్పద పరిస్థితుల్లో ఇద్దరు మృతి

Satyam NEWS

Leave a Comment