40.2 C
Hyderabad
May 5, 2024 16: 43 PM
Slider విజయనగరం

విజయనగరం నడిబొడ్డున పల్లె వాతావరణం…!

#exhibition

సనాతన సంప్రదాయాలను భావితరాలకు తెలియజేస్తూ, సినిమా సెట్టింగ్లను తలపించే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఎంతైనా అభినందనీయమని విజయనగర మున్సిపల్ కార్పొరేషన్   నగర డిప్యూటీ మేయర్ శ్ కోలగట్ల శ్రావణి అన్నారు. ఈ మేరకు నగరంలో ని రింగ్ రోడ్ లో  ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాల ఎగ్జిబిషన్ ను డిప్యూటీ మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రజలకు ఎంతో  ఉత్సాహానిస్తుందన్నారు.

అంతరించిపోతున్న మన గ్రామీణ సంస్కృతిని, మన సంక్రాంతి సంబరాల పండుగ ప్రాశస్యాన్ని నిర్వాహకులు ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలియ చెప్పడం ఎంతైనా అభినందనీయమన్నారు. ఎగ్జిబిషన్లో ఆకర్షించే విధంగా భారీ  సెట్ తో పాటు, 35 స్టాల్స్ ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. నూతన సంవత్సరం, సంక్రాంతి సంబరాలు లో   ఈ ఎగ్జిబిషన్ ఎంతో వినోదాన్ని ఇస్తుందని అన్నారు. ప్రవేశాన్ని అతి తక్కువ ధరతో ఎగ్జిబిషన్ను నిర్వాహకులు ప్రజలకు అందిస్తున్నారని అన్నారు.

ఎగ్జిబిషన్ నిర్వాహకులు శ్రీనివాసరాజు  మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి గారి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈరోజు నుండి ప్రారంభమయ్యే సంక్రాంతి ఎగ్జిబిషన్ 40 రోజులపాటు కొనసాగుతుందని అన్నారు. సంక్రాంతి సంబరాలు, మన గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా సెట్టింగులు వేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలందరూ తమ ఎగ్జిబిషన్ను ఆదరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దుప్పాడ సునీత,   డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మనుమరాలు శ్రీనిక ,యువత, ప్రజలు ఉన్నారు.

Related posts

కరోనా వైరస్ కు కోడి గుడ్డుకు సంబంధం లేదు

Satyam NEWS

22 పోలీస్ స్టేష‌న్లు…443 కిలోమీట‌ర్లు..విజయనగరం జిల్లాలో దిశ జాగృతియాత్ర‌

Satyam NEWS

పెళ్లి వేడుకకు వచ్చారు..శవాలై వెళ్లారు

Satyam NEWS

Leave a Comment