37.2 C
Hyderabad
May 2, 2024 11: 58 AM
Slider విజయనగరం

22 పోలీస్ స్టేష‌న్లు…443 కిలోమీట‌ర్లు..విజయనగరం జిల్లాలో దిశ జాగృతియాత్ర‌

#disaapp

ఈ నెల 30 విజ‌య‌న‌గ‌రం క‌స్పా హైస్కూల్లో ముగింపోత్స‌వం…!

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో దాదాపు ప‌ది రోజుల  పాటు..22 పోలీస్ స్టేష‌న్లు…443 కిలోమీట‌ర్లుతో జిల్లా వ్యాప్తంగా దిశ జాగృతి యాత్ర‌… సంచ‌రిస్తోంది. వాస్త‌వానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న చేప‌ట్టిన  దిశ జాగృతి యాత్ర రాష్ట్ర  వ్యాప్తంగా ప్రారంభ‌మైంది. అందులో బాగంగా జిల్లాలో ఈ నెల 21 పోలీస్ బ్యారెక్స్ లో జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారిచే దిశ జాగృతి యాత్ర ప్రారంభించారు..జిల్లా పోలీస్ బాస్..ఎస్పీ దీపిక‌.

అటు రెవిన్యూ బాస్ ,ఇటు పోలీస్ బాస్ లు ఇద్ద‌రూ మ‌హిళ‌లే కావ‌డం అందునా దిశ  జాగృతి యాత్ర‌ను అట్ట‌హాసంగా ప్రారంభించారు. ప‌ది రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఎంపిక చేసిన  22  పోలీస్ స్టేషన్ల లో….దాదాపు 443 కిలోమీట‌ర్లు రోడ్డు మార్గాన దిశ జాగృతి యాత్ర సంచిరిస్తోంది.

ముఖ్యంగా హైస్కూళ్ల‌లో ఆ దిశ  జాగృతి యాత్ర వెళ్లి…అక్క‌డి విద్యార్ధినీల‌తో మమేక‌మై…అదీ వారి క‌న్న‌వారు, హెడ్మాస్ట‌ర్లతో ద‌గ్గ‌రండీ ఆడిపిల్ల‌ల్లో  అవ‌గాహ‌న చైత‌న్యం క‌ల్పించేందుకు య‌త్నిస్తోంది.ముఖ్యంగా విద్యార్ధినీలు సత్ప్రవర్తనతో మెలిగి, ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ప్రలోభాలు, వ్యామోహాలకు స్వస్తి పలకాలని, మహిళల రక్షణకు ప్రత్యేకంగా రూపొందించిన చట్టాలు, దిశా యాప్ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు.

తాము ఎదుర్కొంటున్న వేధింపులపై విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు దిశా ఫిర్యాదు బాక్సులను పాటశాలలో ఏర్పాటు చేశారు. ప్ర‌త్యేకించి మ‌హిళా సంర‌క్ష‌క పోలీసుల‌తో…ఆయా హైస్కూళ్ల‌కు వెళ్లి. అక్క‌డి విద్యార్దినీల‌ను క‌లిసి..దిశ జాగృతి యాత్ర ల‌క్ష్యాలు,ఆశ‌యాల‌ను వెల్ల‌డిస్తున్నారు.

అయితే దాదాపు ప‌ది రోజుల పాటు అయితే  ఇటీవ‌లే ఏఎస్పీగా ప‌దోన్న‌తి పొందిన  విజ‌య‌న‌గ‌రం ఇంచార్జ్ డీఎస్పీ అనిల్…ఈ దిశజాగృతి యాత్ర‌కుప్ర‌ణాళిక సిద్దం చేసారు.అదీ పోలీస్ బాస్ సూచ‌న‌లు,ఆదేశాలతో..జిల్లా వ్యాప్తంగా ఎన్నెన్ని  పీఎస్  ల‌లో తిర‌గాలి..ఏ విధంగా యాత్ర  తిర‌గాలి..ఎవ‌రెవ‌రు… ఈ యాత్ర‌ను స్వాగ‌తల ప‌ల‌కాలి అన్న ప్ర‌ణాళిక మొత్తం ఏసీపీ అనిల్…ద‌గ్గ‌రుండీ రచించారు.

ఈ నెల 30 దిశ జాగృతి యాత్ర విజ‌య‌న‌గ‌రం రానున్న సంద‌ర్బంగా విజ‌య‌న‌గ‌రం టూటౌన్ పీఎస్ ప‌రిధిలో క‌స్పాలో  లో  ఆ దిశ జాగృత యాత్ర ముగింపు ఉత్స‌వం నిర్విహించ‌నుంది…జిల్లా పోలీస్ శాఖ‌.

పార్వ‌తీపురం,చిన‌మేరంగి,జియ్య‌మ్మ వ‌ల‌స‌లో దిశ  జాగృతి యాత్ర‌….!

విజ‌య‌న‌గ‌రంలో ప్రారంభమైన దిశ జాగృతి యాత్ర‌..పార్వ‌తీపురం డివిజ‌న్ లో ప్ర‌వేశించింది. ఈ మేర‌కు పార్వ‌తీపురం,జియ్య‌మ్మ‌వ‌ల‌స‌,చిన‌మేరంగి పీఎస్ ప‌రిదిల‌లో దిశ జాగృతి యాత్ర ప‌ర్య‌టించింది. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలను దిశ జాగృతి బృందం సందర్శించింది.

అక్క‌డే విద్యార్థులను సత్ప్రవర్తనతో మెలిగి, ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ప్రలోభాలు, వ్యామోహాలకు స్వస్తి పలకాలని కోరింది. మహిళల రక్షణకు ప్రత్యేకంగా రూపొందించిన చట్టాలు, దిశా యాప్ పట్ల విద్యార్థులకు అవగాహన ఈ దిశ జాగృతి యాత్ర ద్వారా క‌ల్పించారు.

అదే విధంగా విద్యార్ధ‌నీలు ఎదుర్కొంటున్న వేధింపులపై  ఫిర్యాదు చేసేందుకు దిశా ఫిర్యాదు బాక్సులను అటు క‌ళ‌శాల‌,ఇటు పాఠ‌శాలలో ఏర్పాటు చేశారు.అంత‌క‌ముందు జియ్యమ్మవలస మండలం, చినమేరంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  దిశ జాగృతి బృందం సందర్శించి పాఠ‌శాల విద్యార్ధినీ,విద్యార్దుల‌కు ప‌లు సూచ‌న‌లు,జాగ్ర‌త్త‌లను తెలిపింది.

ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐ.టి.డి.ఎ పి.ఒ ఆర్.కూర్మనాధ్, ఎ.పి.పి ప్రియ దర్శిని, పార్వతిపురం సి.ఐ విజయ ఆనంద్, పార్వతీపురం టౌన్ ఎస్.ఐ లు జి. కళాధర్, కె.ప్రయాగమూర్తి,  పార్వతీపురం రూరల్ ఎస్ఐ వై.సింహాచలం, గరుగుబిల్లి ఎస్.ఐ ఎం.రాజేశ్,ల్విన్ పేట సి.ఐ టి.వి.తిరుపతి రావు, చినమేరంగి ఎస్.ఐ దినకర్, జియ్యమ్మవలస ఎస్.ఐ, గాయకులు గజల్ గాంధీ, పాఠశాల ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

భాగ్యనగరంలో క్విట్ ఇండియా స్ఫూర్తితో నిరసన

Satyam NEWS

తెలంగాణాలో 7వ శాఖను ప్రారంభించిన సానీ ఇండియా

Satyam NEWS

కరోనా నుంచి మెగాస్టార్ చిరంజీవికి రిలీఫ్

Satyam NEWS

Leave a Comment