40.2 C
Hyderabad
April 29, 2024 17: 32 PM
Slider గుంటూరు

కరోనా వైరస్ కు కోడి గుడ్డుకు సంబంధం లేదు

guntur west

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సందర్భంగా చికెన్, కోడి గుడ్ల వాడకంపై అపోహలు నెలకొన్న నేపథ్యంలో గుంటూరులో అవగాహనా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియం పక్కన ఉన్న మునిసిపల్ స్కూల్ లో గుంటూరు జిల్లా పౌల్ట్రీ వర్కర్స్ & పౌల్ట్రీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది.ఈ కార్యక్రమంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ పాల్గొని ప్రసంగించారు.

కరోనా వైరస్ వ్యాప్తికి కోడి గుడ్డు, చికెన్ లకు సంబంధంలేదని ఆయన తెలిపారు. ఈ అవగాహనా కార్యక్రమంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ తో బాటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజీ, మిర్చియార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, నగర YSRCP అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ, కావటి మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Related posts

భార్య చాటు అధికారం చెలాయించే భర్తల కట్టడికి ఆదేశాలు

Satyam NEWS

వైసీపీ నేత ఆమంచి కుటుంబం నుండి ప్రాణ రక్షణ కల్పించండి!

Satyam NEWS

సిద్ధవటం మార్కెట్ చైర్మన్ గా ఏకుల రాజేశ్వరి

Satyam NEWS

Leave a Comment