34.7 C
Hyderabad
May 4, 2024 23: 37 PM
Slider విజయనగరం

సుదీర్ఘమైన సేవలతో పోలీసుశాఖకు వెన్నెముకగా నిలిచిన వారికి వీడ్కోలు

#vijayanagarampolice

సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో ఎంతో క్రమ శిక్షణతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన (1) సాలూరు టౌన్ పిఎస్ అదనపు ఎస్ఐ బిక్కవోలు సోమరాజు (2) విజయనగరం డీటీసీ ఎస్ఐ ముని బుచ్చిరాజు (3) ఎస్.కోట ఏఎస్ఐ నంగిరెడ్ల సూర్యనారాయణలకు జిల్లా పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ ఎం.దీపిక డీపీఓలో లో ఘనంగా “ఆత్మీయ వీడ్కోలు” పలికారు.

ఈ “ఆత్మీయ వీడ్కోలు” కార్యక్రమంకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక ముఖ్య అతిధిగా హాజరై, మాట్లాడుతూ – ఉద్యోగ విరమణ చేస్తున్న ముగ్గురు పోలీసు అధికారులు పోలీసుశాఖకు సుదీర్ఘంగా నిష్కల్మషంగా సేవలందించి శాంతి భద్రతల పరిరక్షణ, తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణలో పోలీసుశాఖకు వెన్నుముఖగా నిలిచి, పోలీసు వ్యవస్థకు మంచి పేరును తీసుకొని వచ్చారన్నారు.

అంకిత భావంతో విధి నిర్వహణ చేసి, ఉత్తమ సేవలందించినందుకుగాను సర్వీసులో పలు నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు పొందారన్నారు. ఉద్యోగ విరమణ చేసినప్పటికీ మీరంతా పోలీసు శాఖలో భాగమేనని, ఎప్పుడు, ఏ అవసరం వచ్చినా, తమని సంప్రదించేందుకు వెనుకాడవద్దని, సహాయం అందించేందుకు తానెప్పుడు సిద్ధంగానే ఉంటానన్నారు. ఉద్యోగవిరమణ చేసిన తరువాత వచ్చిన బెనిఫిట్స్ ను సక్రమంగా వినియోగించు కోవాలని, శేష జీవితం ఆనందంగా సాగేందుకు చక్కని ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.

క్రమశిక్షణతో ప్రతిభావంతంగా విధులను నిర్వహించడంలో ఉద్యోగుల సతీమణులు పాత్ర ఎనలేనిదని జిల్లా ఎస్పీ కొనియాడారు.

కానిస్టేబుల్ స్థాయి నుండి క్రమశిక్షణతో విధులు నిర్వహించి, ఎస్ఐలుగా, ఏఎస్ఐగా పదోన్నతులు పొంది, పోలీసుశాఖ కు సుదీర్ఘ కాలం సేవలిందరించారన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు తమ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రతీ రోజూ యోగా, మెడిటేషను వంటివి చేపట్టి, ఆరోగ్యాన్ని, మానసిక ఆనందాన్ని పొందే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా ఎస్పీ ఎం. దీపిక సూచించారు.

ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులు పోలీసుశాఖకు అందించిన సేవలను ఏఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, డీసీఆర్ బి సీఐ బి.వెంకటరావు, పోలీసు అసోసియేషను అడహక్ అధ్యక్షులు కె.శ్రీనివాసరావులు ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులను కొనియాడుతూ, ప్రసంగించారు.

అనంతరం, ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారుల దంపతులను పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ ఎం. దీపిక శాలువలు, పూలమాలలు, పండ్లు, గిఫ్టులు, నూతన వస్త్రాలు, జ్ఞాపికలతో సత్కరించి, ఘనంగా “ఆత్మీయ వీడ్కోలు” పలికారు.

అదే విధంగా జిల్లా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరుపున జిల్లా ఎస్పీ జ్ఞాపికలను, చెక్ లను అందజేసారు. ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులు మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి, తమకు ఘనంగా “ఆత్మీయ వీడ్కోలు” పలకడం, సత్కరించడం తమ జీవితంలో ఎన్నటికీ మరువలేమని ఉద్యోగ విరమణ చేసిన అధికారులు జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఎల్. శేషాద్రి, డీసీఆర్ బి సిఐ బి.వెంకటరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ జి.రాంబాబు, పోలీసు అసోసియేషన్ అడహక్ అధ్యక్షులు కె.శ్రీనివాసరావు, కో-ఆపరేటివ్ కార్యదర్శి నీలకంఠం నాయుడు పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొని, ఉద్యోగ విరమణ చేస్తున్న అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

Breaking News: శ్రీలంకలో తలెత్తిన రాజకీయ సంక్షోభం

Satyam NEWS

జీర్ణమైన వస్త్రాలు పారేయకండి.. పేదలకు పంచుదాం

Satyam NEWS

కాండిల్ లైట్: ఘనంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి

Satyam NEWS

Leave a Comment