28.7 C
Hyderabad
April 28, 2024 05: 23 AM
Slider మహబూబ్ నగర్

జీర్ణమైన వస్త్రాలు పారేయకండి.. పేదలకు పంచుదాం

#vivekananda

జీర్ణమైన వస్త్రాలు పారేయకుండా తమకు అందించాల్సిందిగా స్వామి వివేకానంద సేవ బృందం అధ్యక్షులు శివ కుమార్ కోరారు.

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని స్వామి వివేకానంద సేవ బృందం ఆధ్వర్యంలో బుధవారం పాత బట్టల పంపిణీ, పాత బట్టల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో లో శివ కుమార్ మాట్లాడుతూ కల్వకుర్తి పట్టణ ప్రజలు జీర్ణమైన వస్త్రాలే కదా అని అనవసరంగా పారేయకుండా మాకు అందిస్తే నిరుపేదలైన అభాగ్యులకు పంచి పెడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నేడు పట్టణానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ మోయినుద్దీన్ వారి దగ్గర  పాత బట్టలు ఉన్నాయని సమాచారం తీసుకున్న తమ బృందం వారి నుండి సేకరించిన పాత బట్టలను పట్టణానికి దేవరకొండ రహదారిలో గుడిసెలలో నివాసముంటున్న పేద ప్రజలకు పంచి పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో  సభ్యులు రఫిక్ ,తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్త్రీ జాతి చైతన్యం కోసం పరితపించిన గుడిపాటి వెంకటాచలం

Bhavani

మఠంపల్లి మండల కేంద్రంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు

Satyam NEWS

టి‌ఎస్‌పి‌ఎస్‌సి పై హైకోర్టులో పిటిషన్

Murali Krishna

Leave a Comment