28.7 C
Hyderabad
May 6, 2024 01: 12 AM
Slider నిజామాబాద్

కాండిల్ లైట్: ఘనంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి

nightingale

ఫ్లోరెన్స్ నైటింగేల్  200 వ జయంతి పురస్కరించుకుని నిజామాబాద్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ , తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్, నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్  విద్యార్థులు , ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగులు నిర్వహించిన ఈ ర్యాలీలో దాదాపు వెయ్యి మంది నర్సస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్ మాట్లాడుతూ 2020 నర్సుల సంవత్సరంను నర్సుల సంవత్సరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించిందని తెలిపారు. రోగులకు ఆరోగ్య సేవలను అందించడంలో నర్సులు కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు.

అందువల్ల నర్సింగ్, మిడ్‌వైఫరీ వర్క్‌ఫోర్స్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రమే సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించగలమని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పిందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన  ఆదేశాలు ప్రకారం ప్రవేట్ ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్ నర్సెస్ కు కనీస వేతనo 20,000/-ఇవ్వాలి అనే చట్టాన్ని అమలు చేయాలని, జెండర్ తో సంబంధ లేకుండా మేల్ నర్సెస్ కూడా ఫిమేల్ నర్సెస్ తో పాటు సమానంగా ఉద్యోగ, ఉన్నత విద్య కు అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని, అలాగే కాంట్రాక్టు నర్సింగ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఉన్నవారిని రెగ్యులరైజ్  చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులలో పని చేసే ప్రతి నర్సింగ్ ఆఫీసర్ కు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో నర్సింగ్ డైరెక్టర్ ఏర్పాటు చేయాలని లక్ష్మణ్ రూడవత్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు చీలుపురి వీరాచారి, డాక్టర్ చెరుకూరి రామ్ తిలక్, కోశాధికారి వంశీ ప్రసాద్, తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ అనిత,  వైస్ ప్రిన్సిపాల్ సబితా, శ్రీనివాస్, ప్రభుత్వ నర్సింగ్  విద్యార్థులు,  ఉద్యోగులు పాల్గొన్నారు.

Related posts

టి ఆర్ ఎస్ కు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్న బిజెపి

Satyam NEWS

రాష్ట్రంలో వేడుకగా 680 పాఠశాలలు ప్రారంభం

Murali Krishna

స్వయంభు శంభు లింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు

Satyam NEWS

Leave a Comment