29.7 C
Hyderabad
May 6, 2024 06: 04 AM
Slider గుంటూరు

మైనింగ్ పేరుతో సాగు భూములు లాక్కుంటున్నారు

#NarasaraopetMP

ముందస్తు సమాచారం లేకుండా తమ భూముల్లో మైనింగ్ అధికారులు సర్వేలు చేపట్టారని, ఇది అన్యాయమని గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని యడవల్లి గ్రామ ఎస్సీ, ఎస్టీ రైతులు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలకు ఫిర్యాదు చేశారు.

వివరణ కోరినా  సరైన సమాధానం చెప్పకుండా తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని రైతులు వాపోయారు. 1975 వ సంవత్సరం లో అప్పటి ప్రభుత్వం, ఆనాటి జిల్లా కలెక్టర్ కత్తి చంద్రయ్య యడవల్లి వీకర్స్ సెక్షన్ ల్యాండ్ కాన లైజేషన్ సొసైటీ ఏర్పాటు చేశారు.

అప్పటి నుంచి తమ భూములను సాగు చేసుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం మా భూముల్లో ఉన్న మైనింగ్ ను కాజేసేందుకు కుట్ర పన్నితే జాతీయ కమిషన్ లను ఆశ్రయించామని వారు కో-ఆపరేటివ్ సొసైటీ వారికి సొసైటీ పునరుద్ధరించాలని అన్నారు.

ఆ తరువాత సొసైటీ వారు రెన్యువల్ చేసుకునేందుకు అవకాశం కల్పించిందని అన్నారు. జిల్లా అధికారులు,స్థా నిక అధికారులు సొసైటీ ఎన్నికలు జరపకుండా కాలయాపన చేసి మరోసారి తమ భూములు కాజేసేయందుకు  కుట్ర జరుగుతుందని రైతులు పేర్కొన్నారు.

ఈ విషయమై ఎంపీ మాట్లాడుతూ సొసైటీని పునరుద్ధరించే విధంగా జిల్లా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేస్తాను అని హామీ ఇచ్చారు.

Related posts

వైస్సార్సీపీ ని విడిచి  టీడీపీ లో చేరిన గిరిజనులు

Satyam NEWS

కడప లో ఏరులైపారుతున్న తెలంగాణా మద్యం

Satyam NEWS

పెద్ద ఎత్తున నిషేధిత పొగాకు పదార్ధాలు స్వాధీనం

Satyam NEWS

Leave a Comment