35.2 C
Hyderabad
May 1, 2024 00: 31 AM
Slider నల్గొండ

పరపతి సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు

#pac

వ్యవసాయ పరపతి సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందుతున్నాయని ఎంపిపి గూడెపు శ్రీనివాసు అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల పరిధి లోని బూరుగడ్డ పి ఎ సి ఎస్ కార్యాలయంలో గోడౌన్ నిర్మాణానికి నాబార్డ్ నిధుల నుండి మంజూరైన 20 లక్షల రూపాయలతో నిర్మాణ పనులకు శనివారం పి ఏ సీ ఎస్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు,సర్పంచ్ ఎస్ కే సలిమా రంజాన్ బేగం తో కలిసి ఎంపిపి గూడెపు శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ పరపతి సహకార సంఘాల ద్వారా రైతులకు దీర్ఘకాలిక ఋణాలు, సబ్సిడీ పై విత్తనాలు,ఎరువులు అందిస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గువ్వల వీరయ్య,వెంకయ్య,ఎంపిటిసి మచ్చ వెంకటేశ్వర్లు,అరుణ్ కుమార్ దేశ్ ముక్,సి ఈ ఒ కీర్తి వెంకటేశ్వర్లు,సొసైటి డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్  హుజూర్ నగర్

Related posts

సమాచార హక్కు చట్టాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలి

Satyam NEWS

ప్రజావాణి ఫిర్యాదులపై శ్రద్ధ వహించాలి

Satyam NEWS

తెలుగు తెరకు తిరుగులేని విలన్: హ్యారి జోష్

Satyam NEWS

Leave a Comment