Slider ప్రత్యేకం

సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా

#sajjala

సీఎం జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ కార్యకలాపాలను దగ్గరుండి పర్యవేక్షించే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆయన రేపోమాపో రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సలహాదారులకూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందనే ఆదేశాలు వెలువడటంతో సజ్జల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులై క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుండి జీత భత్యాలు పొందుతున్న దాదాపు 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని స్పష్టం చేస్తూ భారత ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.

ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి ఎన్నికల కమిషన్ కు అనేక ఫిర్యాదులు అందాయని, నిర్దేశిత పనికి బదులుగా, వారు రాజకీయ ప్రచారం/రంగంలోకి ప్రవేశిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ విలేకరుల సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారని  కమిషన్ గుర్తించింది. వివరణాత్మక సమీక్ష తదుపరి ప్రభుత్వ మంత్రికి వర్తించే విధంగా ఈ సలహాదారులకు కూడా  ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని ఈసీఐ స్పష్టంచేసింది. కమిషన్ ఈ ఆదేశాలను ఏమాత్రం ఉల్లంఘించినా తీవ్రంగా పరిగణిస్తూ సంబంధిత చట్టాలకు లోబడి కఠినమైన చర్యలను తీసుకోవడం కూడా జరుగుతుంది  ఈసీఐ స్పష్టం చేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నా కూడా ఎక్కువగా పార్టీ కార్యక్రమాలలోనే పాల్గొంటుంటారు.

పార్టీ పరంగానే ఆయన అన్ని విషయాలపై ప్రతిపక్షాల ఆరోపణలకు వివరణలు ఇస్తుంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని శాఖల మంత్రుల తరపునా కూడా ఆయనే మాట్లాడుతుంటారు. జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏ మంత్రి కూడా ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించింది లేదు. అన్ని శాఖలు, అన్ని విషయాలూ సజ్జల రామకృష్ణారెడ్డే చూసుకునేవారు. అలాంటిది ఇప్పుడు ఎన్నికల కోడ్ లోకే సలహాదారులు వస్తారు అంటే ఇక సజ్జల రాజకీయ పరమైన విషయాలు మాట్లాడేందుకు వీలుఉండదు. సజ్జల రాజకీయాలు మాట్లాడ కుండా ఊరుకోవడం వీలు కాదు కాబట్టి ఆయన రాజీనామా చేయక తప్పని పరిస్థితులు ఉన్నాయి.

Related posts

యూపీ డిప్యూటీ సీఎం బ్రజే ష్ పాఠక్ చిలుకూరులో పూజలు

Bhavani

పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

Satyam NEWS

కరోనాతో భయపడొద్దు.. అలాగని నిర్లక్ష్యంగా ఉండొద్దు

Satyam NEWS

Leave a Comment