40.2 C
Hyderabad
April 28, 2024 18: 19 PM
Slider వరంగల్

వాహన వినియోగదారులకు సౌకర్యాలు కల్పించండి

#petrole

ములుగు జిల్లా కేంద్రంలో గల పెట్రోల్ బంకుల్లో గాలి చెకింగ్,టోల్ ప్లాజా వద్ద మరుగుదొడ్లు, వాహన వినియోగదారులకు సరైన సౌకర్యాలు కల్పించాలని ఉమ్మడి భూపాలపల్లి జిల్లా వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు చల్లగురుగుల మల్లయ్య డిమాండ్ చేశారు. మేడారం మహా జాతర, వేసవి కాలం సమీపిస్తున్న సందర్భంలో వినియోగదారులకు సరియైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. జాతీయ రహదారిపై రాత్రి పగళ్లు ప్రయాణం చేసే వాహన దారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి పెట్రోల్ బంకులో వాహనదారులకు ఏయిర్ కంప్రేషర్ ఉపయోగంలో ఉండాలి. మరుగు దొడ్ల సౌకర్యం,తాగునీటి వసతి కనీస సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలనే నిబంధనలతో పెట్రోలియం కంపెనీలు అనుమతి ఇస్తే నామమాత్రమైన సౌకర్యాలు కల్పిస్తూ ఆయిల్ కంపెనీల సూచనలను బంకుల నిర్వాహకులు పట్టించుకోవడం లేదని,టోల్ ప్లాజా వద్ద గల మరుగుదొడ్లను వాహనదారులు వినియోగించుకునే విధంగా లేవని,నీటి సౌకర్యం,కరెంటు సరిగా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వినియోగదారుల సమాఖ్య కోశాధికారి సంగ రంజిత్ కుమార్ పాల్గొన్నారు.

Related posts

Professional What Natural Herbs Are Good For High Blood Pressure

Bhavani

షాడో మేయర్ చేతిలో జీవీఎంసీ బందీ

Satyam NEWS

18 నుండి మునుగోడులో సంజయ్

Satyam NEWS

Leave a Comment