37.7 C
Hyderabad
May 4, 2024 11: 41 AM
Slider ఖమ్మం

వ్యవసాయ రంగ సమస్యలు పై చర్చ జరపాలి

#KhammamFarmers

పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ రంగ సమస్యలు పై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా  ఏన్కూర్ లో నిరసన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ ఆర్డినెన్స్ లు ఉపసంహరించుకోవాలని, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు.

రైతు రుణాలు మాఫీ చేసి రైతులకు తిరిగి బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ ఆర్డినెన్స్ లు భవిష్యత్తులో రైతులకు తీవ్ర నష్టం చేసే అవకాశం ఉందని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కార్పొరేట్లకు దోచిపెడుతున్న నూతన విధానాలు

ఒకే దేశం ఒకే మార్కేట్ రైతులకు ప్రయోజనం ఉండదని, ఇది కార్పోరేట్ సంస్థలు ప్రయెజనాలకు అనుకూలంగా ఉందని ఆయన అన్నారు. దేశంలో వ్యవసాయ మార్కెట్ లు ఉన్నప్పటికీ 95 శాతం రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తుల ను అయిన కాడికి పంట పొలాల్లో లేదా ఇంటి దగ్గర నే అమ్ముకుంటున్నారని ఆయన తెలిపారు. 

ఈ పరిస్థితుల్లో రైతులు దేశంలో  ఎక్కడికైనా వెళ్లి వ్యవసాయ ఉత్పత్తుల అమ్ముకోవచ్చు అంటు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రైతు ప్రయోజనాలు కు వ్యతిరేకంగా కార్పోరేట్ సంస్థలు ప్రయెజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బానోతు బాలాజీ రైతు సంఘం మండల అధ్యక్షులు అమరనేని కిషన్ రావు, కార్యదర్శి గుండా సత్యానారయణ రెడ్డి, గార్ల ఒడ్డు సోసైటి వైస్ చైర్మన్ రేగళ్ళ తిరుమలరావు, రైతు సంఘం మండల నాయకులు స్వర్ణ కృష్ణారావు, నండూరి శ్రీనివాస్ రావు, ఇల్లూరి రామచంద్రరావు, ఇంజం వేణు, గార్లపాటి సీతారాములు, లెనిన్, రాములు,  అనందరావు, గార్లపాటి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పుకార్లు నమ్మవద్దు..పుకార్లు పుట్టించవద్దు…

Satyam NEWS

వింత ఆచారం:గ్రహణం రోజున పిల్లలను పాతిపెడితే

Satyam NEWS

ప్రత్యేక అధికారి పాలనలోకి వెళ్ల బోతున్న జీహెచ్ఎంసి?

Sub Editor

Leave a Comment